cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ప్రజాతీర్పు.. తన భిక్షేనన్న పవన్ కల్యాణ్!

 ప్రజాతీర్పు.. తన భిక్షేనన్న పవన్ కల్యాణ్!

తెగించినోడికి తెడ్డే లింగం అని ఒక సామెత ఉంది. తనకు తిక్క ఉందని సినిమాల్లో చెప్పుకున్న పవన్ కల్యాణ్.. ఆ తిక్క మాటలు మాట్లాడుతూ తిరుగుతున్నాడు. తిరుమలలో పవన్ కల్యాణ్ మరింత తిక్క మాటలు మాట్లాడారు.

అవేమిటంటే.. 'జగన్ కు ముఖ్యమంత్రి పదవి నా భిక్షే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాకు దండం పెట్టుకోవాలి.. నేను, టీడీపీ, బీజేపీ కలిసి ఉంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేదా..?' అని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తూ ఉన్నారు!

ఈ మాటలు ఎంత ప్రహసనమో వేరే చెప్పనక్కర్లేదు. లేస్తే మనిషిని కాదన్నట్టుగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి ప్రజాతీర్పును, ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే.. దాన్ని తన భిక్ష అని అనడం పవన్ కల్యాణ్ కే సాధ్యం అవుతూ ఉంది.

బహుశా ప్రజాస్వామ్యంలో ఇంత పొగరబోతు మాటలు, పిచ్చి మాటలు మాట్లాడిన వారు ఎవరూ ఉండరు కాబోలు. అయినా తెలుగుదేశం పార్టీతో, బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని పవన్ కల్యాణ్ ను ఎవరైనా కోరారా? ఇది వరకూ ఏమో తెలుగుదేశం గెలిస్తే అది తన వల్లనే అని పవన్ కల్యాణ్ ప్రచారం చేసుకున్నారు. 

ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి  వ్యతిరేకంగా పోటీ చేసి అది కూడా తన వల్లనే అని చెప్పుకోవడం పవన్ కల్యాణ్ మానసిక స్థితిని తెలియజేస్తూ ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.

అయినా.. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూటా యాభై ఒక్క సీట్లను భిక్షగా విదిల్చిన పవన్ కల్యాణ్..  తను మాత్రం ఎందుకు ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారో! కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేని అధినేతగా నిలవడం ప్రజలు పవన్ కల్యాణ్ కు విదిల్చిన భిక్ష కావొచ్చు!

 


×