cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

'జగన్ నువ్వూ మూడు పెళ్లిళ్లు చేసుకో' పవన్ సూచన!

'జగన్ నువ్వూ మూడు పెళ్లిళ్లు చేసుకో' పవన్ సూచన!

'రాజకీయాల్లో విలువలు.. జనసేన కుల రాజకీయాలు చేయదు.. వ్యక్తిగత విమర్శలు నేను చేయను..' ఇవీ.. పవన్ కల్యాణ్ తాజా సూక్తిముక్తావళి. అయితే ఇదే సూక్తిముక్తావళి గురించి చెబుతూనే, ఆయన పూర్తిగా వ్యక్తిగత విమర్శలే చేశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉండివచ్చారంటూ పవన్ ధ్వజమెత్తారు. జగన్ తో పాటు విజయసాయి రెడ్డి కూడా జైల్లో ఉండివచ్చారంటూ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడింది, ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లిష్ మీడియం అంశం గురించి. అయితే పవన్ ఆ అంశం గురించి జగన్ వ్యాఖ్యలపై సూటిగా స్పందించలేదు.

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ చదువులను పవన్ వంటి వాళ్లు వ్యతిరేకిస్తే, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? అని జగన్ ప్రశ్నించారు. అయితే పవన్ అందుకు స్పందించలేదు. 'మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు..' అని తనను జగన్ అన్నారంటూ పవన్ వాపోయారు. ఇందు మూలంగా పవన్ ఇచ్చిన సూచన ఏమిటంటే, 'జగన్ మోహన్ రెడ్డిగారూ మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండి.. నేనేం సరదాగా చేసుకోలేదు…' అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

తను ఎప్పుడూ జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించలేదని పవన్ చెప్పుకొచ్చారు. మరి కోడికత్తి పార్టీ, జగన్ జైలుకు వెళ్లారు, జగన్ జైలుకు వెళ్తారు.. అంటూ మాట్లాడిన మాటలను ఏమనాలో పవన్ కే తెలియాలి.
ఇక స్కూల్స్ లో తెలుగు గురించి మాట్లాడమంటే.. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి పవన్ మాట్లాడారు. జగన్ ను ఫ్యాక్షనిస్టు అని కూడా ఇదే ప్రెస్ మీట్లో పవన్ అన్నారు. 

ఇక అతుకుల బొంతలా సాగిన పవన్ ప్రసంగం.. ఇంకా ఏదేదో చెబుతూ సాగింది. మధ్య సురవరం ప్రతాపరెడ్డి, తెలంగాణలో ఉర్దూకలబోత తెలుగు మాట్లాడతారు, ఏపీలో జనాలకు పరిపూర్ణ తెలుగు మాట్లాడటం రాదు..అని కూడా తన స్టేట్ మెంట్లు ఇచ్చారు పవన్!