cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్ అహంకారం ఎంత చేటో చూశావా!

పవన్ అహంకారం ఎంత చేటో చూశావా!

'జగన్ మోహన్ రెడ్డి ఎలా సీఎం అవుతాడో చూస్తా..' 'జగన్ నిన్ను సీఎం కానివ్వను..' ఇవీ వీరావేశంతో ఎన్నికల ప్రచార సభల్లో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పలికిన పలుకులు. వీరావేశంతో అనడం కంటే.. వీర అహంకారంతో పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడారు అని చెప్పడం కరెక్ట్.

ఏపీకి ముఖ్యమంత్రి కావాలంటే తన ఆమోదముద్ర ఉండాలన్నట్టుగా, తను చెప్పినవారే ఏపీ సీఎం అవుతారన్నట్టుగా.. పవన్ కల్యాణ్ భ్రమపడ్డాడు. ఆ భ్రమలో కూడా తెలివిగా మాట్లాడలేదు. ఒళ్లంతా అలుముకున్న అహంకారంతో పవన్ కల్యాణ్ అనుచితంగా మాట్లాడారు. 'జగన్ ఎలా సీఎం అవుతాడో చూస్తా..' అన్న పవన్ కల్యాణ్ జగన్ ఎలా సీఎం అవుతున్నాడో ఇప్పుడు చూస్తూ ఉండవచ్చు!

'జగన్ ను సీఎంగా కానివ్వను.. ' అని చెప్పిన పవన్ కల్యాణ్ తను ఆఖరికి ఎమ్మెల్యే కాలేకపోయారు. రెండుచోట్ల పోటీచేసి రెండుచోట్లా ఓడిపోయారు. ఎందుకిచ్చారో కూడా అర్థం కానట్టుగా జనాలు ఆయన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని ఇచ్చారు. జనసేనలో జనంలేరు, పవన్ కల్యాణ్ సినిమా పిచ్చోళ్లు మాత్రమే ఉన్నారని పూర్తిక్లారిటీ వచ్చింది.

ఇకపై పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల వైపు వెళితే జనసేన కేవలం ఒక గడ్డిబొమ్మలా మిగిలే అవకాశం ఉంది కూడా.