cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్ కల్యాణ్ రీఎంట్రీకి రంగం సిద్ధం?!

పవన్ కల్యాణ్ రీఎంట్రీకి రంగం సిద్ధం?!

ఒకవైపు జనసేనలో నేతలు మిగిలేలాలేరు. వాళ్లు పార్టీలో ఉన్నా సాధించింది కూడా ఏమీలేదు. ఎన్నికల్లో డిపాజిట్లు కూడా చాలామంది పొందలేకపోయారు. ఇప్పుడు వారు కూడా తమదారి తాము చూసుకుంటూ ఉన్నారు. జనసేనకు స్టార్లుగా వెలుగొందిన వారిలోకొందరు కామ్ అయిపోగా, మరికొందరు వేరే పార్టీల  దారుల్లో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ మాత్రం ప్రెస్ నోట్ల రాజకీయం చేస్తూ ఉన్నారు.

ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తే తన బాధ్యత అయిపోతుందన్నట్టుగా జనసేన అధినేత భావిస్తున్నట్టుగా ఉన్నారు. అయితే అలాంటి రాజకీయాల ముచ్చటను జనాలు పట్టించుకునే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో మరోవైపు పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం గురించి చర్చకొనసాగుతూ ఉంది. 

పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించాలని అన్నట్టుగా చిరంజీవి కూడా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ ను హీరోగా పెట్టి రామ్ చరణ్ ఒక సినిమాను రూపొందించాలనే ఆకాంక్షను వ్యక్తంచేశారు చిరంజీవి. ఈ నేపథ్యంలో సినిమాకు రంగం సిద్ధం అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి పని చేసుకోవాలనేది చిరంజీవి అభిప్రాయం కూడా అన్నట్టుగా ఉంది వ్యవహారం.

ఇక బయటి నిర్మాతలు కూడా పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ప్రయత్నాల్లో ఉండనే ఉన్నారని తెలుస్తోంది. ఏతావాతా.. త్వరలోనే పవన్ మళ్లీ సినిమాకు ఓకే చెప్పి రంగంలోకి దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. మళ్లీ ఎన్నికల వరకూ ఎలాగూ పెద్దగా పని కూడా ఉండదు కాబట్టి, ఎన్నికలు వచ్చేంత వరకూ పవన్ సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

అఖిలప్రియ.. కేరాఫ్ గందరగోళ రాజకీయం!