cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్ కల్యాణ్.. అవే బజారు మాటలు!

పవన్ కల్యాణ్.. అవే బజారు మాటలు!

తను ఏమైనా అనొచ్చు.. తనను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు.. ఇదీ పవన్ కల్యాణ్ తీరు. రాహుల్ గాంధీ బ్రహ్మచర్యంలోని లొసుగుల గురించి తను మాట్లాడొచ్చు.. తన నాలుగు పెళ్లిళ్ల గురించి మాత్రం ఎవ్వరూ ఏమీ అనకూడదు. తను మాత్రం అందరి పంచెలూ ఉడగొడతాడు, అందరి అంతూ చూస్తాడు.. వాళ్ల వాళ్ల ఊర్లకు వెళ్లి అంతు చూస్తానని హెచ్చరించేస్తాడు.. ఆయనను మాత్రం ఎవ్వరూ ఏమీ అనకూడదు. ఏమైనా అన్నారో.. వాళ్లను బజారుకు ఈడుస్తానని అంటున్నాడు. ఇదీ పవన్ కల్యాణ్ తీరు.

ఇటీవల పవన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేసిన వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఏ అంశం గురించి స్పందించని పవన్ కల్యాణ్ కేవలం పెళ్లిళ్ల విషయంలో మాత్రం భుజాలు తడుముకుంటున్నాడు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు నాయుడి పార్ట్ నర్ గా అభివర్ణించాడు జగన్.

చంద్రబాబు అవినీతిలో పవన్ కు వాటా ఉందని వైసీపీ అంటోంది. పవన్ కల్యాణ్ చంద్రబాబును ప్రశ్నించలేదు నాలుగేళ్ల పాటు ఎందుకు? అని కూడా ప్రశ్నిస్తోంది. పవన్ కల్యాణ్ రాజకీయం సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువలాగా ఉందని కూడా జగన్ అన్నాడు. అయితే వాటిలో ఏదీ పవన్ కు తప్పనిపించలేదు. తన పెళ్లిళ్ల గురించి మాట్లాడటం మాత్రం తప్పనిపించేసింది!

తన పెళ్లిళ్ల గురించి మాట్లాడే వాళ్లను బజారుకు ఈడుస్తానని పవన్ హెచ్చరించేశాడు. ఇదీ జనసేన అధినేత రాజకీయం. పంచెలు ఊడగొట్టడం, అంతుచూడటం, కథలు తేల్చడం అయిపోయాయి.. ఇప్పుడు బజారుకు ఈడ్చే కార్యక్రమాలు అట. ఊళ్లలో కొళాయిల వద్ద కొట్లాడే ఆడవాళ్లు మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పవన్ అంటున్నారు పరిశీలకులు.

తెలంగాణ వోటింగ్ ఇవాలే... ముళ్లు ఎటువైపు తిరుగనుంది?