cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

నీలాంబరిగా మారిన పూజా హెగ్డే

నీలాంబరిగా మారిన పూజా హెగ్డే

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో పూజా క్యారెక్టర్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బయటకొచ్చాయి. ఆచార్యలో నీలాంబరి అనే గిరిజన యువతిగా కనిపించబోతోంది పూజా హెగ్డే.

ఓ తండాలో ఉండే నీలాంబరి.. రామ్ చరణ్ నేతృత్వంలో నడుస్తున్న నక్సలైట్స్ గ్రూప్ కు మద్దతుగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ నక్సల్ గ్రూప్ కు ఇన్ ఫార్మర్ అన్నమాట. ఈ క్రమంలో చరణ్ తో ఆమె ప్రేమలో పడడం లాంటి వ్యవహారాల్ని ఆచార్యలో చూడొచ్చు.

ఆచార్యలో చరణ్-పూజాహెగ్డే మధ్య 2 పాటలుంటాయి. వీటిలో ఒకటి మాంటేజ్ సాంగ్. ఈ పాటను రంపచోడవరం అటవీ ప్రాంతంలో చిత్రీకరించారు. మరో పాట ఇంకా పెండింగ్ లో ఉంది. సినిమాలో కోసం వేసిన ధర్మస్థలి టెంపుల్ సెట్ లో ఆ సాంగ్ తీయాల్సి ఉంది.

నీలాంబరి లుక్ కోసం పూజాహెగ్డే పూర్తిగా మేకోవర్ అయింది. ఆమె డ్రెస్సింగ్, కట్టుబొట్టు అంతా గిరిజన యువతి టైపులోనే ఉంటుంది. నడక తీరు, లుక్స్ కోసం పూజాహెగ్డే కాస్త గట్టిగానే హోం వర్క్ చేసిందని చెబుతున్నారు.

నీలాంబరి పాత్ర చెప్పగానే ఎవరికైనా నరసింహా సినిమాలో రమ్యకృష్ణ గుర్తొస్తుంది. అంతటి పవర్ ఫుల్ పాత్ర అది. ఇప్పుడు అదే పాత్ర పేరును ఆచార్యలో పూజాహెగ్డేకు పెట్టారు. మరి ఈ నీలాంబరి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. 

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×