cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

పోయినోళ్లు అందరూ మంచోళ్లేనా?

పోయినోళ్లు అందరూ మంచోళ్లేనా?

''....ఫర్నిచర్‌ విషయం చెప్పి కోడెల కన్నీళ్లు పెట్టుకున్నారు. కుమారుడి షోరూమ్‌పై ఉన్న ఇంట్లో కొంత ఫర్నిచర్‌ ఉందని తెలిసిన తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశానని కోడెల చెప్పారు....''

''....కోడెల కుమారుడి పేరిట ఉన్న బైక్ డీలర్‌ షిప్‌ రద్దు చేయించడంతో పాటు కోడెల కుమార్తె నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీ మూసివేయించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ కంపెనీని అయినకాడికి అమ్ముకోవడానికి కూడా కోడెల సిద్ధపడ్డారు. ....''

కోడెల శివప్రసాదరావు మరణించారు. పోయినోళ్లు అందరూ మంచోళ్లు అన్నాడు ఆచార్య ఆత్రేయ. ఆయన ఆ విధంగా మంచివాడయిపోతే తప్పుపట్టడానికి లేదు. కానీ రాజకీయంగా మావాడు, కులపరంగా మావాడు, అందువల్ల ఆయన తప్పుచేసినా ఒప్పే అనేరీతిలో వ్యాఖ్యానాలు వండి వారిస్తే మాత్రం తప్పే. కేవలం జగన్ మోహన్ రెడ్డి అనే ఆయన కావాలని, కసిపెట్టుకుని, పనికట్టుకుని వేధించి వేధించి, చనిపోయేలా చేసాడు. కోడెల మీద, ఆయన కుటుంబీకుల మీద ప్రభుత్వం అన్యాయంగా కేసులు బనాయించింది అని అంటే మాత్రం ముమ్మాటికీ తప్పే.

మీదన ఫస్ట్ రాసిన వాక్యంలో ఏముంది? తన కొడుకు షోరూమ్ మీదన కొంత ఫర్నిచర్ వుండిపోయింది అని తెలిసి, తీసుకెళ్లమని లేఖ రాసారా? ఇదేం చిత్రం. ఓ స్పీకర్ గా తన ఆఫీసు ఫర్నిచర్ ఎక్కడ వుంటోందో? ఎక్కడికి వెళ్తోందో ఆయనకు తెలియదా? కొడుకు షో రూమ్ మీదకు వెళ్లింది కాబట్టి తెలుసుకుని, వెనక్కు తీసుకెళ్లమన్నారు. అదే ఏ ఒఎల్ఎక్స్ లాంటి సెకెండ్ హ్యాండ్ మార్కెట్ కో వెళ్తే..? అప్పుడేం చేసేవారు?

కొడుకు బైక్ షోరూమ్ లైసన్స్ ఎందుకు రద్దయింది? ఎందుకు షో రూమ్ సీజ్ చేసారు? ఆ ప్రవచనకర్తకు తెలియదా? కొత్త బైకులు అమ్మి, టెంపరరీ రిజిస్ట్రేషన్ ఫీజులు ప్రభుత్వానికి కట్టకుండా కోట్లు ఎగ్గొట్టిన వైనం గురించి ప్రస్తావించరేమి? అంటే ఇలాంటి అవినీతి వ్యవహారాలను మరణాలకు ముడిపెట్టి శుద్ది చేసేస్తారా? కోడెల కుమార్తే ఫార్మా కంపెనీకి ఎందుకు సమస్యలు వచ్చాయి. అక్కడ జరిగిన వ్యవహారాలు ఏమిటి? వాటి గురించి మాత్రం మాట్లాడరా?

అసలు తెలుగుదేశం జనాలే కోడెల ఫ్యామిలీ మీద ఎందుకు ఫిర్యాదులు చేసారు. వాటి నిగ్గు తేల్చవచ్చు కదా? పోనీ ఈ ప్రవచన కర్త ఆధ్వర్యంలోనే కమిటీ వేస్తే, కే టాక్స్ కంప్లయింట్ల నిగ్గుతేల్చి, నిజాలు బయటపెట్టగలరా? ఇవన్నీ మానేసి, కేవలం మానసికంగా హింసించారనే విపరీత ప్రచారం మాత్రం ఏల?

రాష్ట్రం అంతటా ఈ తప్పుడు ప్రచారం సాగించవచ్చు. కానీ కోడెల ఇలాకాలో మాత్రం నమ్ముతారో? నమ్మరో? తెలుగుదేశం జనాలకు, ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన ఈ ప్రవచన కర్తకు తెలియదా? సాక్షాత్తూ 'ఈ కోడెల మనకేల' అంటూ ఆయన సామాజిక వర్గ మ్యాగ్ జైన్ లో ఎందుకు వ్యాసం ప్రచురించాల్సి వచ్చింది. ఈ ప్రవచనకర్త ఆ వ్యాసం చదివి వుండరు అని అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఆయనకు కూడా ఆ మ్యాగ్ జైన్ వెళ్లకుండా వుండదు కదా?

కేవలం అసెంబ్లీ ఫర్నిచర్ అనే చిన్నఅంశాన్ని, ఒక్క పాయింట్ ను మాత్రమే పదే పదే ప్రవచిస్తూ, కోడెల పిల్లల వ్యవహారాలను పూర్తిగా మరుగున పరుస్తూ, శవాల మీద చిల్లర ఏరుకునే చందంగా, రాజకీయ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్న తీరును చూస్తే జనాలకు మాత్రం సానుభూతి కలుగకపోగా, అసహ్యం వేస్తుంది. ఆ సంగతి ఈ ప్రవచన కర్త, ఆయన అభిమాన పార్టీ ఎప్పుడు తెలుసుకుంటారో?

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు