cloudfront

Advertisement


Home > Politics - Political News

ఓటు వేయలేదు.. ప్రకాష్‌రాజ్‌ ఇరుక్కున్నాడు!

ఓటు వేయలేదు.. ప్రకాష్‌రాజ్‌ ఇరుక్కున్నాడు!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలో బాగా గలాభా రేపిన వ్యక్తుల్లో ప్రకాష్ రాజ్‌ కూడా ఒకరు. స్వతహాగా కన్నడీగుడు అయిన ప్రకాష్ రాజ్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేక అజెండాను అందుకున్నాడు. తను హిందువులకు వ్యతిరేకిని కాదు, హిందుత్వకు వ్యతిరేకిని అంటూ ధ్వజమెత్తాడు.

ప్రత్యక్ష రాజకీయాల వైపు రాకపోయినా ప్రకాష్ రాజ్ రాజకీయాలపై తన హాట్ కామెంట్స్‌ను కొనసాగించాడు. మొదట్లో బీజేపీకి తప్ప ఎవరికైనా ఓటేయండన్నట్టుగా మాట్లాడాడు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత జేడీఎస్ వాళ్లు వెళ్లి బీజేపీతో చేతులు కలపడం ఖాయమనే భావనతో.. ఆ రెండు పార్టీల మీదా విరుచుకుపడటం ప్రారంభించాడు.

కర్ణాటక వ్యాప్తంగా తిరుగుతూ బీజేపీ వ్యతిరేక ప్రసంగాలతో.. మోడీ, షాలపై విరుచుకుపడుతూ, పనిలో పనిగా యడ్యూరప్పనూ కడిగేస్తూ సాగాడు ప్రకాష్ రాజ్. అలాగే కర్ణాటక రాజకీయ పరిణామాలపై జాతీయ మీడియా వర్గాలతో కూడా అనునిత్యం మాట్లాడుతూ వచ్చాడు. ఆ వీడియోలన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ నటుడు.

ఇలా పార్టీల కార్యకర్తల కన్నా ఎక్కువ సేపు సమయాన్ని కేటాయించి ఈ నటుడు కర్ణాటక ఎన్నికల్లో భాగస్వామి అయ్యాడు. ఇంత యాక్టివ్ రోల్ పోషించిన ప్రకాష్ రాజ్ చివర్లో మాత్రం అనూహ్యంగా కామెడీ అయిపోయాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయకపోవడమే ఈయనపై ఇప్పుడు వ్యంగ్యాస్త్రాలకు కారణం.

కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేయని కన్నడీగ ప్రముఖుల్లో ప్రకాష్ రాజ్ కూడా ఒకరట. కాంగ్రెస్ మాజీ ఎంపీ, నటి రమ్యతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఈ జాబితాలో ఉన్నాడని తెలుస్తోంది. తనకు ఓటు హక్కు ఉండి కూడా రమ్య ఓటేయకపోగా, ప్రకాష్ రాజ్‌కు మాత్రం కర్ణాటకలో ఓటు హక్కు లేదని తెలుస్తోంది.

ఇతడి ఓటు హక్కు చెన్నైలో ఉందట. కొన్నేళ్లుగా అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరుచుకున్న ఇతడు ఓటు హక్కును అక్కడకే మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇలా కర్ణాటక ఎన్నికలపై రన్నింగ్ కామెంట్రీ చెప్పిన ప్రకాష్ రాజ్ అక్కడ ఓటేయలేకపోవడంతో బీజేపీ సపోర్టర్లు దుమ్మెత్తి పోస్తున్నారు.