cloudfront

Advertisement


Home > Politics - Political News

ప్రియాంక.. ఆ సాహసం చేస్తే.. సూపర్!

ప్రియాంక.. ఆ సాహసం చేస్తే.. సూపర్!

'వారణాసి నుంచి ప్రియాంక వాద్రా పోటీ..' గత కొన్నాళ్లుగా చర్చలో ఉన్న అంశం ఇది. ఈ ఊహాగానానికి ఆస్కారం ఇచ్చింది స్వయంగా ఆమే కావడం విశేషం. ప్రియాంక ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా రంగంలోకి దిగి, యూపీలో పర్యటిస్తున్న తరుణంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. ఆమెను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమని కోరారు.. అమేథీ, రాయబరేలీల్లో ఎక్కడైనా ప్రియాంక పోటీచేస్తే బావుంటుందని వారన్నారు. గాంధీల కుటుంబం సేఫెస్ట్ సీట్ల పేర్లనే కార్యకర్తలు సూచించినా.. ప్రియాంక మాత్రం.. 'వై నాట్ వారణాసి' అంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.

వారణాసి నుంచి ప్రధాని మోడీ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో నెగ్గారు. ఈ సారి కూడా ఆయన వారణాసి నుంచినే పోటీ చేస్తారనే అంచనాలున్నాయి. దీంతో ఆమె వారణాసి ప్రస్తావన తీసుకురావడం ఒకింత సంచలనంగానే ఉంది. ఇప్పుడు అందుకు సంబంధించిన ఊహాగానం తెరమీదకు వచ్చింది.

ప్రియాంక అక్కడ నుంచి పోటీ చేయవచ్చని అంటున్నారు. దానికి ఆమె సై అంటున్నారట. అయితే ఆమె అన్నయ్య, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదం కోసమే ఆమె వేచి ఉన్నారట. ఒకవేళ రాహుల్ ఓకే చెబితే ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.

ఆ మేరకు ప్రియాంక వారణాసిలో మోడీని ఢీ కొంటే అది కాంగ్రెస్ అమీతుమీ తేల్చుకోవడమే అవుతుంది. మోడీని ప్రియాంక ఓడిస్తే అంతకు మించిన సంచలనం ఉండదు. ఆమె బరిలోకి దిగితే అక్కడ ఎస్పీ, బీఎస్పీ తదితర పక్షాలు అన్నీ ఆమెకే మద్దతు పలుకుతాయి. మరి ప్రియాంక చేత ఆ సాహసం చేయించడానికి కాంగ్రెస్ సై అంటుందా? అనేది ఇంకా డౌటే!

వార్ వన్ సైడే.. నా? ఎవరి లెక్కలు వారివి!