cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ వ్యూహంపై ప్రొఫెస‌ర్ అద్భుత విశ్లేష‌ణ‌

జ‌గ‌న్ వ్యూహంపై ప్రొఫెస‌ర్ అద్భుత విశ్లేష‌ణ‌

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కుడిగా, మేధావిగా గుర్తింపు , గౌర‌వం ఉన్న ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావు అంత‌ర్వేది ఘ‌ట‌న , జ‌గ‌న్ వ్యూహంపై సునిశిత విశ్లేష‌ణ చేశారు. అంత‌ర్వేది ఘ‌ట‌న‌ను సీబీఐకి అప్ప‌గించ‌డం అనేది  ప్ర‌తిప‌క్షాల‌పై ముఖ్య మంత్రి జ‌గ‌న్ మాస్ట‌ర్ స్ట్రోక్‌గా అభివ‌ర్ణించారు. 

రాజ‌కీయ‌, సామాజిక‌, ఆర్థిక త‌దిత‌ర ప‌రిణామాల‌పై  ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావు త‌న‌దైన శైలిలో ప్ర‌తిరోజూ త‌న సొంత యూట్యూబ్ చాన‌ల్‌లో ఆక‌ట్టుకునే విశ్లేష‌ణ‌లు చేయ‌డం చూస్తున్నాం. ఈ నేప‌థ్యంలో అంత‌ర్వేది ఘ‌ట‌న‌ను సీబీఐ విచార‌ణ‌కు అప్ప‌గించ‌డంపై త‌న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు నాగేశ్వ‌ర‌రావు చెప్పారు. ఇంత‌కూ ఆయ‌న ఏమ‌న్నారంటే...

"అంత‌ర్వేది ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ‌కు వెళ్లాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇది రాజ‌కీయంగా చాలా తెలివైన వ్యూహం. ఎందుకంటే అంత‌ర్వేది ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ , దాని మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన , ఆ మాట‌కొస్తే తెలుగుదేశం కూడా ఆంధ్ర‌ప్ర‌దేవ్ ప్ర‌భుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాయి. 

అంత‌ర్వేదిలో ర‌థం ద‌గ్ధం చేసిన ఘ‌ట‌న కేవ‌లం చ‌ట్ట ఉల్లంఘ‌న‌, శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య కాదు. అది కోట్లాది మంది ప్ర‌జ‌ల విశ్వాసాల మీద దాడి గ‌నుక ...ఇది ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగిందా?  లేక కుట్ర‌కోణంలో జ‌రిగిందా? అనేది చూడాలి" అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఎత్తుకు పైఎత్తులు వేయ‌డంలో జ‌గ‌న్ ఎప్పుడూ రెడీగా ఉంటార‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం. దాన్ని ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావు లాంటి వారు గుర్తించి, తెలివైన వ్యూహంగా అభివ‌ర్ణించ‌డం వైసీపీ స‌ర్కార్‌కు బ‌ల‌మైన నైతిక మ‌ద్ద‌తుగా చెప్పొచ్చు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే...

"తొంద‌ర‌ప‌డి కొంత మంది అధికారులు ఇది పిచ్చి వాళ్ల ప‌ని అని చెప్ప‌డంతో ప‌రిస్థితి జ‌ఠిల‌మైంది. దీన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక మ‌తానికి చెందిన ప్ర‌జ‌ల‌పైన ప్ర‌భుత్వ నాయ‌క‌త్వంలో దాడి జ‌రుగుతోంది, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి రెచ్చిపోతున్నారు , జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కుటుంబంలో క్రైస్త‌వ మ‌త ప్ర‌చార‌కులున్నారు, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్రైస్త‌వ మ‌త న‌మ్మ‌కం క‌లిగిన వారు ఇలాంటివ‌న్నీ ప‌ట్టుకొస్తున్నారు" అంటూ ప్ర‌తిప‌క్షాలు ఒక వ్యూహం ప్ర‌కారం మ‌తం ప్రాతిప‌దిక‌న తీసుకొస్తున్న అంశాల్ని ప్రొఫెస‌ర్ ప్ర‌స్తావించ‌డాన్ని చూడొచ్చు. 

అస‌లు స‌మ‌స్య ఎక్క‌డుందో గుర్తిస్తే ... స‌గం ప‌రిష్కారం దొరికిన‌ట్టే. అంత‌ర్వేది ఘ‌ట‌న‌లో ప్ర‌తిప‌క్షాలు మ‌త ప్రాతిప‌దిక‌న సాగిస్తున్న వికృత క్రీడ‌ను జ‌గ‌న్ స‌ర్కార్ స‌మ‌ర్థ‌వంతంగా తిప్పి కొట్టింద‌నేందుకు జ‌గ‌న్ తాజా ఎత్తుగ‌డే నిద‌ర్శ‌నం. అందుకు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావు లాంటి వాళ్ల ప్ర‌శంస‌లే నిద‌ర్శ‌నం.

"ముఖ్య‌మంత్రి మ‌త విశ్వాసాల‌ను, అంత‌ర్వేది ఘ‌ట‌న‌తో లింక్ చేసి పార్టీలు మాట్లాడ్డం మొద‌లైంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు విచార‌ణ జ‌రిపినా...నిజాయితీగా జ‌రిపినా పెద్ద‌గా ప్ర‌యోజనం ఉండ‌దు. ఇదొక రాజ‌కీయ‌మైన దాడి, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై చేయాల‌ని ప్ర‌త్య‌ర్థులు అనుకుంటున్నారు, ఇందుకు ఆయ‌న కుటుంబ నేప‌థ్యం ఉప‌యోగ‌ప‌డుతుంది... క‌నుక ఉప‌యోగించుకుంటున్నారు"....ఇదీ అంత‌ర్వేది ఘ‌ట‌న‌, అనంత‌ర ప‌రిణామాల‌పై నాగేశ్వ‌ర‌రావు గారి సునిశిత ప‌రిశీల‌న‌.

"ఏపీ పోలీసుల ఆధ్వ‌ర్యంలో నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌రిగినా అంగీక‌రించ‌డానికి సిద్ధంగా ప్ర‌తిప‌క్షాలు సిద్ధంగా లేవు. అందువ‌ల్ల రాష్ట్ర ప్ర‌భుత్వం తను విచార‌ణ‌ను వ‌దిలేసి, సీబీఐకి అప్ప‌గించ‌డం అంటే కేంద్రం చేతిలో పెట్ట‌డ‌మే. ఇప్పుడు ఎవ‌రైతే త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారో వాళ్ల ప్ర‌భుత్వ విచార‌ణ సంస్థ‌ల చేతికి విచార‌ణ బాధ్య‌త అప్ప‌గించారు.  రేప‌టి నుంచి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని విమ‌ర్శించ‌డానికి బీజేపీకి ఆయుధం ఉండ‌దు" అని ఆయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు తేల్చి చెప్పారు.

"ఇక టీడీపీ కూడా ఏమీ మాట్లాడ‌లేదు. మోడీని మాట్లాడే ప‌రిస్థితి లేదు. అందువ‌ల్ల జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విచార‌ణ బాధ్య‌త‌ల‌ను సీబీఐకి అప్ప‌గించ‌డం వ‌ల్ల ప్ర‌తిప‌క్షాల నోట్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డ‌ట్టైంది. ఇక రేప‌టి నుంచి ఎవ‌రిపై ఉద్య‌మం చేయాలి? ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మాలు ఎవ‌రికి వ్య‌తిరేకంగా చేయాలి. అంత‌ర్వేది ఘ‌ట‌న సృష్టించిన సవాళ్ల నుంచి సీబీఐకి అప్ప‌గించ‌డం ద్వారా ఒక ర‌కంగా జ‌గ‌న్ బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టే చెప్పాలి" అని ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావు లోతైన , స‌మ‌గ్ర‌మైన విశ్లేష‌ణ చేశారు.  

"రాజ‌కీయాల్లో వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు ఉంటాయి. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఇర‌కాటంలో పెడ‌దామ‌ని బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ ప్ర‌జ‌ల మ‌త భావాల‌కు సంబంధించిన సున్నిత‌మైన అంశాన్ని ఎత్తుకున్నాయి. పెద్ద ఉద్య‌మాలు న‌డిపాయి. దాంతో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కౌంట‌ర్ స్ట్రాట‌జీ వేశారు" అంటూ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావు చేసిన విశ్లేష‌ణ ఇప్పుడు వైసీపీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. 

ఏ విధంగానైతే అంత‌ర్వేది ఘ‌ట‌న‌ను సీబీఐ విచార‌ణ‌కు అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుని ప్ర‌తిప‌క్షాల నోట్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డ‌ట్టు చేశారో.... ప్ర‌తిప‌క్షాల కుట్ర‌లు, కుతంత్రాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టి, వాటిని జ‌గ‌న్ చిత్తు చేయ‌డాన్ని ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావు చ‌క్క‌గా ఆవిష్క‌రించ‌డం ద్వారా .... మ‌త వైషమ్యాల‌తో రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌నుకున్న రాజ‌కీయ పార్టీలు, సంఘ విద్రోహ‌శ‌క్తులకు ప్రొఫెస‌ర్ గారు దిమ్మ తిర‌గేలా చేశారు.  

హిందుత్వం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదు

అమరావతి ఏమౌతుంది?

 


×