cloudfront

Advertisement


Home > Politics - Political News

జనసేన అలా దూసుకొచ్చిందన్న పవన్!

జనసేన అలా దూసుకొచ్చిందన్న పవన్!

అసలు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థం అవుతోందో లేదో కానీ.. గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు మద్దతు ఇవ్వడం వల్లనే జనసేన దూసుకుపోయిందని చెబుతున్నాడు. ఏ రాజకీయ పార్టీ అయినా.. సొంతంగా పోటీచేసి సత్తా చూపిస్తే దానికంటూ ఒక గుర్తింపు వస్తుంది. తనస్థాయి ఏమిటో అందరికీ అర్థం అవుతుంది. అయితే పవన్ కల్యాణ్ కు మాత్రం అలా అనిపించడం లేదు. 

గత ఎన్నికల్లో తను తెలుగుదేశం, బీజేపీలకు మద్దతు ఇవ్వడం వల్లనే తన పార్టీ దూసుకుపోయిందని చెప్పుకుంటున్నాడు. మరి ఇప్పటి వరకూ ఏం దూసుకుపోయిందో.. ఏం దూకుడు చూపిందో కూడా చెప్పుకుని ఉంటే బావుండేది.

బహుశా.. గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలు గెలిచాయి కాబట్టి.. ఆ గెలుపు నుంచి తనకు గుర్తింపు వచ్చిందని పవన్ అనుకుంటున్నాడేమో. అయితే అలా కాదట.. ఆ పార్టీలనే తనే గెలిపించానని పవన్ చెప్పుకుంటున్నాడు ఇప్పుడు కూడా.

మరి వేరే పార్టీలకు మద్దతు ఇస్తే.. గుర్తింపు వస్తుంది, తన పార్టీ అలా బలపడుతుంది అని పవన్ అనుకుంటుంటే.. ఈ సారి కూడా ఏదో ఒక పార్టీకి మద్దతును ఇస్తే జనసేన మరింతగా దూసుకుపోతుందేమో. పవన్ కే ఈ విషయం తెలియాలి. 

ఇక యథాఫలంగా తెలుగుదేశం పార్టీ నేతలను తను ఏమీ అనడం లేదని.. జగన్ మాట తీరు మాత్రం సబబు కాదని.. మూడు దశాబ్దాల పాటు తననే ఎన్నుకునేలా పాలనను అందిస్తానని జగన్ అనడం సరికాదని పవన్ ఈకలు పీకాడు.

తనకు ముఖ్యమంత్రి కావాలని లేదని, ముఖ్యమంత్రి కావడానికి రాజకీయాల్లోకి రాలేదని.. మరో మెట్ట వేదాంతం పలికాడు. పవన్ లో వేదాంతం ఏ రోజుకు ఆ రోజు మారిపోతూ ఉంటుందిలే!

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?