Advertisement

Advertisement


Home > Politics - Political News

అధ్యక్షుడు మారిపోతే అంతా ఓకేనా?

అధ్యక్షుడు మారిపోతే అంతా ఓకేనా?

మొత్తానికి తన రాజీనామా విషయంలో పట్టిన పట్టు సాధించాడట రాహుల్ గాంధీ! పట్టుబట్టి ప్రధాని పీఠాన్ని సాధించలేకపోయినా.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా విషయంలో మాత్రం రాహుల్ గాంధీ తను అనుకున్నది సాధించారు! ఆయన రాజీనామా వెనక్కు తీసుకోవాలని చాలామంది సలహా ఇచ్చారట. అయితే ఎవరి సలహాలనూ వినే రకంలా కనిపించడం లేదు రాహుల్ గాంధీ!

అలా సలహాలు వినే పరిస్థితే ఉంటే... కాంగ్రెస్ కు ఈ దుస్థితి వచ్చేది కాదేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వృద్ధ జంబూకాల సలహాలు విని సోనియాగాంధీ కాంగ్రెస్ ను ఒక రకంగా నాశనం చేస్తే, ఎవరి మాటా వినక రాహుల్  మరోరకంగా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారనేది పబ్లిక్ టాక్!

ఎలాగైతేనేం.. రాహుల్ గాంధీ రాజీనామా చేసేసినట్టేనట. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? అంటే.. మరో బానిస ఎవరో ఒకరు. ప్రధాని పీఠంలో మన్మోహన్ ను కూర్చోబెట్టే సోనియాగాంధీ సూపర్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారనే పేరు తెచ్చుకున్నారు. అలాంటిది భారత జాతీయ కాంగ్రెస్ ను తమ జేబు సంస్థగా మార్చేసుకున్న వాళ్లు ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్ష పీఠాన్ని మరొకరికి అప్పగించి వారిని పని చేయనిస్తారా? అనేది తేల్చుకోవడానికి పెద్దగా మేధస్సు ఏమీ అక్కర్లేదు.

తమ వీర విధేయుడు ఎవరో ఒకరికి కాంగ్రెస్ వాళ్లు అధ్యక్ష పీఠాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. తద్వారా వాళ్లు సాధించేది ఏమిటో ముందు ముందు తెలుస్తుంది. ఈ మార్పుతో రాత్రికి రాత్రి కాంగ్రెస్ జాతకం మారిపోయే అవకాశాలు మాత్రం ఏమీ ఉండవని పరిశీలకులు అంటున్నారు. ఇదీ ఒక ప్రయోగంగా, పార్టీకి పెద్దగా ఉత్తేజాన్ని ఇవ్వని ప్రయోగంగా మిగిలిపోవచ్చంటున్నారు.

నిజంగానే కాంగ్రెస్ ను బతికించుకోవాలని సోనియా, రాహుల్ లకు ఉంటే.. వాళ్లు గౌరవంగా అన్ని పదవుల నుంచి తప్పుకుని.. ఉత్తరాదితో మొదలుకుని, దక్షిణాది వరకూ దూసుకువచ్చి.. ప్రజలతో మమేకం కాగల సమర్థుడు ఒకరిని ఎంచుకుని అతడికి ఫుల్ పవర్స్ ఇస్తారు. అయితే  ఇప్పుడు అధ్యక్ష స్థానం మరొకరికి ఇచ్చినా ఆ అధ్యక్షుడిని తమ బంట్రోతులానే చూస్తే దాని వల్ల వచ్చే లాభం ఎంతో అంచనా వేయలేనిది ఏమీకాదు.

బాబుపై కేసుల విచారణకు ఇక అవరోధాలు లేవు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?