Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆటలేనా పిల్లలూ.. చేతలు కూడా ఉన్నాయా..?

ఆటలేనా పిల్లలూ.. చేతలు కూడా ఉన్నాయా..?

మనుషులు ఎదుగుతారే కానీ, వయసుకి తగ్గ పరిణతి ప్రదర్శించలేరు కొంతమంది. అలాంటి వారసులను చూసి తల్లిదండ్రులకు ఎక్కడలేని దిగాలు. కేంద్రంలో అలాంటి వారసుడు రాహుల్ గాంధీ అయితే, రాష్ట్రంలో అంతకు మించిన ఘనుడు నారా లోకేష్. 

పార్టీని రాహుల్ చేతుల్లో పెట్టలేక, తాను నడపలేక, వయోభారం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సోనియా గాంధీ. ఇక్కడ చంద్రబాబుది కూడా అదే సిచ్యుయేషన్. జగన్ తో పోటీపడలేక, రిటైర్మెంట్ ప్రకటించి కొడుకుకి పార్టీ పగ్గాలు అప్పగించలేక సతమతం అవుతున్నారు. తల్లిదండ్రులు బిడ్డల గురించి ఆరాట పడుతున్నారే కానీ, బిడ్డలు మాత్రం అన్నీ లైట్ తీసుకుని ఆటపాటల్తో హాయిగా గడిపేస్తున్నారు.

ఆటవిడుపా..? సాహసమా..??

రాహుల్ గాంధీ సముద్రంలో దిగి ఈతకొట్టారు. కొన్ని గంటలుగా ఈ వీడియో సోషల్ మీడియాని ఊపేస్తోంది. మత్స్యకారుల సమస్యలు తెలుసుకోడానికి వెళ్లిన రాహుల్ కి, నడిసముద్రంలోకి వెళ్లగానే దూకేయాలని ఉబలాటం కలిగింది. అంతే, వెంటనే దూకేశారు, ఈదుకుంటూ మళ్లీ బోటులోకి వచ్చేశారు. 

పనిలో పనిగా చేపలు కూడా పట్టారు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవాలన్నా, వారితో మమేకం కావాలన్నా, వారి దగ్గరకు వెళ్లేంత వరకు ఓకే, వారితో కలసి చేపలు పట్టడం వరకు పర్వాలేదు, సముద్రంలో దూకి ఈత కొడతామంటే మాత్రం కాస్త పిల్ల చేష్టలు అనుకోవాల్సిందే. దానికి కాంగ్రెస్ నేతలు హడావిడి చేయడం ఇంకాస్త ఓవర్ యాక్షన్ గా మారింది.

అటు వైరిపక్షాలు మాత్రం రాహుల్ ని, కాంగ్రెస్ ని చడామడా వాయించేశాయి. మత్స్యకారులను అడ్డు పెట్టుకుని డ్రామా నడిపించారని, రాహుల్ కి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదని, ఆయన్ని పార్టీ పేరుతో కట్టిపడేస్తే, అప్పుడప్పుడు ఇలా తన సరదాలు తీర్చుకుంటున్నారని విమర్శలు చేశారు.

సైకిల్ ఎక్కాలా? పైకి ఎత్తాలా..?

ఇక్కడ నారా లోకేష్ తక్కువ తిన్నారా.. కారులో పరామర్శయాత్రకు వెళ్తున్న ఆయనకు ఓ అభిమాని సైకిల్ చూపించారు. అంతే ఇక లోకేష్ కి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. సైకిల్ దగ్గరకు తెమ్మనితెచ్చారు. దీన్ని బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకున్నట్టు ఎత్తి చూపించారు. 

కరోనా టైమ్ లో జిమ్ చేసి కాస్త సన్నబడిన లోకేష్.. అప్పటినుంచి తన దేహదారుఢ్యాన్ని చూపించడానికి తెగ ఉబలాట పడుతున్నారు. ఇలా సైకిల్ ఎత్తి ఆ సరదా తీర్చుకున్నారు. వైసీపీని ఎత్తిపడేస్తాడు మా చినబాబు అంటూ వందిమాగధులు జబ్బలు చరుచుకోవడం కొసమెరుపు.

అక్కడ రాహుల్, ఇక్కడ లోకేష్.. ఇద్దరికీ వయసు పెరిగినా, బుద్ధి వికసించలేదని అర్థమవుతుంది. నిండు సభలో మోదీకి కన్నుగీటి హాస్యం చేయడం రాహుల్ కి అలవాటు. తత్తరబిత్తర మాటలతో.. మజ్జిగ కూడా తియ్యగుంది అని చెప్పి నవ్వులు పూయించడం లోకేష్ కి అలవాటు. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన.. వారసులంటే ఎలా ఉండకూడదనడానికి నిదర్శనంగా నిలిచారు. పెద్దలకు వయోభారాన్ని మించిన అతి పెద్ద భారంగా మిగిలారు. 

ఈ సినిమా అడ‌క‌పోతే ప్రొడ్యూస‌ర్ల‌కు హ‌ర్ర‌రే

ఓడిపోయే సరికి కుప్పం గుర్తుకు వచ్చిందా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?