cloudfront

Advertisement


Home > Politics - Political News

'పీసీసీ పగ్గాలిచ్చి ఉంటే వంద సీట్లు గెలిపించేవాడ్ని'

'పీసీసీ పగ్గాలిచ్చి ఉంటే వంద సీట్లు గెలిపించేవాడ్ని'

తనకే గనుక పీసీసీ అధ్యక్ష పీఠం అప్పగించి ఉంటే.. కాంగ్రెస్  పార్టీని తెలంగాణలో వంద సీట్లలో గెలిపించేగలిడే వాడిని అని చెప్పుకున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నేతల్లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... పరోక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరును ఇలా ఎద్దేవా చేశాడు. పీసీసీ పగ్గాలు తన బోటి వాళ్లకు అప్పగించాల్సింది కానీ, ఉత్తమ్ లాంటి వాళ్లకు కాదన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు.

ఎన్నికల ముందు పీసీసీ పగ్గాల కోసం కోమటిరెడ్డి సోదరులు గట్టిగానే ప్రయత్నించారు. దానికోసం ఢిల్లీకి వెళ్లారు కూడా. అయితే అవకాశం దక్కలేదు. పీసీసీ పగ్గాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలుపుకోగలిగాడు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లుకలుకలు బయటపడుతూ ఉన్నాయి.

అసలుకు కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేల్లో కూడా చాలామంది తెరాసలోకి ఫిరాయించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసి సీఎల్పీని తెరాసలోకి విలీనం చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉండిన నేతలు కూడా ఫిరాయించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే వారు ఆ ప్రచారాలను ఖండిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తను సీఎల్పీ లీడర్ రేసులో ఉన్నట్టుగా చెప్పుకున్నారు.

అసెంబ్లీలో కాంగ్రెస్ లీడర్ గా నిలవడానికి తనకు అన్ని అర్హతలూ ఉన్నాయని అంటున్నారు. ఎన్నికల ముందే పీసీసీ పగ్గాలు తనకు ఇవ్వాల్సిందని, అదే జరిగి ఉంటే ప్రస్తుతం పరిస్థితి మరోలా ఉండేదని రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు.

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు