Advertisement

Advertisement


Home > Politics - Political News

రాజకీయ కుట్ర

రాజకీయ కుట్ర

కుక్కను చంపేయాలి అంటే పిచ్చిది అని దాని మీద ముద్రవేయాలి అన్నది సామెత. ఎవరినైనా ఉద్యోగం లోంచి తీసేయాలి అంటే సరైన ఫైల్‌ తయారుచేయాలి అన్నది ఓ మాట. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కలిసి పన్నుతున్న బహుబుఖ వ్యూహం ఇలాంటిదే.

తెలుగునాట మహాకుట్ర జరుగుతోంది. ఇది గరుడపురాణం కాదు. పుక్కింటి పురాణం అంతకన్నా కాదు. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. పచ్చి నిజం... జగన్‌ ప్రభుత్వాన్ని వీలయినంత త్వరగా గద్దె దింపేయాలన్న యోచనతో కసితో పనిచేస్తున్నాయి జనసేన-తెలుగుదేశం కలిసి.

ఇక్కడ జనసేన ప్రయోజనాల కన్నా, తెలుగుదేశం పార్టీ, దాని వెనుక వున్న సామాజిక వర్గ ప్రయోజనాలే ఎక్కువ వున్నాయి. కేవలం జగన్‌ అంటే జెలసీతోనో, మరే కారణం చేతనో జనసేన పార్టీ తెలుగుదేశం పన్నాగంలో ఇరుక్కుని, ఆ పార్టీ చెప్పినట్లు ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ విధంగా ఈ మహా కుట్రకు ఊపిరి పోస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ కుట్రలో భాగంగా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ, ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తాయి. దానికి ఓ వర్గం మీడియా తంతాన తాన అంటుంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వున్న అనుకూల ధోరణి అస్సలు బయటకు రానివ్వరు.

ఆటో జనాలు, మహిళలు, తల్లులు, రైతులు, కౌలుదారులు, విద్యార్థులు, ఇలా అన్ని వర్గాలు పొందుతున్న మేళ్లు కనపడనివ్వరు. అవినీతిని కట్టడి చేసిన వైనం కనిపించదు. మద్యపాన నిషేధం కోసం తీసుకుంటున్న చర్యలు కనిపించవు.

...

......

ఈ మొత్తం వ్యవహారం వెనుక మహా కుట్ర దాగి వుంది. అసలు దీని వెనుక వైనం ఏమిటి? ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? ప్రతి పక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన ఒక్కటై సాగిస్తున్న ప్రచారం ఏమిటి? నాలుగేళ్లకు పైగా దూరం వున్నా, ఎందుకు ఇంత యాగీ చేస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వం మరీ అంత అధ్వాన్నంగా వుందా? అసలు ప్రతి పక్షాల స్ట్రాటజీ ఏమిటి? ఇది తెలుసుకోవడానికి ముందు గడచిన ఆరు నెలల్లో తెలుగుదేశం-జనసేన కలసి మారుస్తూ వచ్చిన ప్రచారాలు ఏమిటో చూడాలి.

వారానికి ఒకటి

ఆపైన స్టార్ట్‌ చేసినది ఇసుక హడావుడి. వర్షాలు ఈసారి ఎప్పటికన్నా ఎక్కువ పడ్డాయి. నీళ్లలోంచి ఇసుక తీయడం కష్టంగా వుంది. అందువల్ల సహజంగా కొరత వచ్చింది. దీన్ని అందిపుచ్చుకుని హడావుడి చేసాయి. ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది.దాంతో తెలుగు మీడియం ను చంకనెత్తుకున్నారు. కానీ జనం మనసులోని మాట తమకు అనుకూలంగా లేదని తెలిసి, వెనక్కు తగ్గారు.

ఇప్పుడు ఉల్లి పంట వ్యవహారం దొరికింది. ఏటా పాత పంట అయిపోయి, కొంత పంట వచ్చే టైమ్‌లో ధరలు పెరుగుతాయి. ఆ విషయం దాచేసి, ఇదంతా జగన్‌ వైఫల్యం ఇదంటూ హడావుడి. ఇలా ఒక్కోసారి ఒక్కో అంశం వంతున, వారానికి ఒకటి తీసుకుంటూ, నానా హడావుడి చేస్తున్నాయి తెలుగుదేశం-జనసేన.

ఇవన్నీ ఒక ఎత్తు...జగన్‌ యాంటీ హిందూ అంటూ చేస్తున్న హడావుడి మరొక ఎత్తు.

బహుళార్థక సాధకం

మొత్తం ఈ మహా కుట్ర వెనుక తెలుగుదేశం పార్టీ అధికార సాధనే పరమార్థంగా వుంది. ఆ అధికార సాధన కోసం పన్నగల పన్నాగాలు అన్నీ పన్నుతున్నారు. అధికారం లేకుండా ఆరునెలలు వుండలేకపోతున్న తెలుగుదేశం పార్టీ జనసేన అండగా, పవన్‌ కళ్యాణ్‌ భుజంపై తుపాకి పెట్టి జగన్‌ ప్రభుత్వంపై గుళ్లు కురిపించే పయత్నంలో వుంది.

గట్టిగా ఆరు నెలలు కాకుండానే ఎందుకింత హడావుడి జరిగిపోతోంది. పట్టుమని పది నెలలు నిండకుండానే ఎందుకింత యాగీ చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం నిజంగా అంత దారుణంగా వుందా? అని ప్రశ్నించుకుంటే, అసలు కారణం అది కాదు. ఒకేసారి అన్ని వైపుల నుంచి తెలుగుదేశం పార్టీకి, దానికి మద్దతు ఇచ్చే కీలక సామాజిక వర్గానికి, ఆ పార్టీని భుజాన మోసే మీడియాకు, ఆ పార్టీని నమ్ముకున్న నాయకులకు వస్తున్న ఆర్థికనష్టం చూసి, ఇలాగే వదిలేస్తే భవిష్యత్‌ అగమ్యగోచరం అయిపోతుందన్న ఆలోచన భయం కలిగించడం చూసి పన్నుతున్న పన్నాగం ఇది.

జగన్‌ వచ్చాక ఏం జరిగింది

సదరు కాంట్రాక్టర్ల నుంచి అడ్డగా నెల నెలా మామూళ్లు అందుకునే బడాబాబుల మూతులు ఎండిపోయాయి.

రౌడీ మామూల్‌ అన్నట్లుగా బడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి నెల నెలా కోట్లకు కోట్లు అందుకున్న పెద్దమనుషులకు బాధ మొదలైంది.

ఏదో రూపంలో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందుకున్న ఓ వర్గపు మీడియాకు జగన్‌ వైనం మింగుడు పడడం లేదు.

లిక్కర్‌ సిండికేట్‌ లకు ఆదాయం పడిపోయింది.

విశాఖలో ఒక హోటల్‌లో ప్రతి నెలా ఏదో ఒక మీటింగ్‌ పెట్టడం లక్షలాది రూపాయలు బిల్లులు చెల్లించడం. ఇలాంటి వ్యవహారాలు తెలిసినవి, తెలియనవి బోలెడు వున్నాయి. ఇలాంటివి అన్నీ ఆగిపోయాయి. దాంతో తెలుగుదేశం అస్మదీయుల మూతులు ఎండిపోతున్నాయి. ఇలా వదిలేస్తే, అయిదేళ్లలో ప్రాణాలు పోతాయేమో అన్నంత భయం. ఇప్పటికే డబ్బులు ఇబ్బడిగా వున్న వారు పార్టీని వదిలి వేరే పార్టీల్లో చేరి, వాటిని కాపాడుకునే పనిలో పడ్డారు. మిగిలినవారు దిక్కులు చూస్తున్నారు.

ఇక ఏం చేయాలి?

ఇలాంటి పరిస్థితుల్లో ఏంచేయాలి. అటు చూస్తే కేంద్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పుణ్యమా అని బడా వ్యాపారుల గుట్లు రట్టవుతున్నాయి. బ్యాంకు రుణాలు తీసుకుని, సోకులు చేసుకుంటూ ఇన్నాళ్లు అంతా తమ ప్రతిభే అంటూ బీరాలు పోయిన వారు, ఇప్పుడు ఐపీలు పెట్టే పరిస్థితి వచ్చింది. అది తట్టుకోవడం ఎలా అనుకుంటే  ఆంధ్రలో జగన్‌ ప్రభుత్వం తమ కాళ్ల కిందకు నీళ్లు కాదు ఏకంగా నిప్పులు తెస్తోంది. ఎంత వీలయినంత త్వరగా జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపితే అంత మంచిది అన్న నిర్ణయానికి వచ్చేసాయి జనసేన-తెలగుదేశం. అయిదేళ్ల సమయం వున్న ప్రజా ప్రభుత్వాన్ని కుట్ర ద్వారా దింపేయాలనుకుంటున్నాయి.

కుట్ర ఎజెండా ఇలా సాగుతుంది

ఆ విధంగా చేయడం వల్ల కేంద్రంలో భాజాపా ప్రభుత్వానికి కోపం వచ్చేలా చేయడం. అద ష్టం బాగుండి కోర్టుల ద్వారా కనుక జగన్‌ ఇరుకున పడితే, అర్జెంట్‌గా అతను దిగిపోయేలా చేయడం. అలా జగన్‌ కనుక దిగిపోతే, వైకాపా నుంచి లేదా జగన్‌ ఫ్యామిలీ  నుంచి ఎవరో ఒకరు సీఎం అవుతారు. అప్పుడు ఇక యాగీ చేయడం మరింత సులభం, పార్టీని చీల్చడం మరింత సులభం.  వైకాపా కకావికలు అయిపోతే, ఇక మళ్లీ మనదేరాజ్యం. మన వాళ్లు, మన మీడియా, మన వ్యాపారాలు, మన కాంట్రాక్టులు, మన హోటళ్లు, మన కన్సల్టెంట్లు, మన అధికారులు, అన్నీ మనవే..అలా అన్నీ మనవే కావాలంటే, ఇప్పుడు అందరూ ఈ కుట్రలో భాగస్వాములు కావాల్సిందే. తప్పుడు ప్రచారాలకు తెరతీయాల్సిందే. ఎవరి వంతు ప్రయత్నం వారు చేయాల్సిందే.

కానీ జనం సంగతి?

జనం ఏమన్నా అంత వెర్రోళ్లా? గరుడ పురాణం వినిపిస్తే, అసలు పురాణం తమకు తెలుసు అని ఓటేసి చాటేసారు. ఊళ్లలో పనులు దొరుకుతున్నాయో లేదో ట్విట్టర్‌లో కూతలు కూసే నాయకుడి కన్నా జనానికే బాగా తెలుసు. అవినీతి తగ్గిందో లేదో తెల్లవారితే ట్విట్టర్‌ లో మొహం చూసుకునే నాయకుడికన్నా జనానికే కచ్చితంగా తెలసు. జనాల ఇళ్ల దగ్గరకు అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయో లేదో? జనాల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయో లేదో? రైతుల ఖాతాలో, కౌలు దారుల ఖాతాలో డబ్బులు చేరాయో లేదో? ఇక హిందూ  వ్యతిరేకత అన్నది. పూజారులకు తెలియదా? ఆలయాల నిర్వాహకులకు తెలియదా? ఎవరి హయాంలో ఆలయాలకు మంచి జరుగుతోందో? బ్రాహ్మణులకు తెలియదా? ఎవరు తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారో?

కుట్ర కథ కంచికే

జగన్‌ కు ఒక్కటే సమస్య. ఆర్థిక వనరులు. మొత్తం ఖాళీ చేసి పెట్టారు చంద్రబాబు. ఆ సమస్య అధిగమించాలి. రాష్ట్రానికి వున్న ఏకైక ఆర్థిక వనరు ఎక్సయిజ్‌ శాఖ. కానీ మొహమాటం లేకుండా మద్యపాన నిషేధం అంటున్నారు. అమలు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు అంతంత మాత్రం. ఇవన్నీ చూసుకుంటూ ఖజానాను బలోపేతం చేసుకోవాలి. అది ఒక్కటి చేసుకోగలిగితే, ఈ భుజాన పరాయి తుపాకీ మోసే తుపాకీ రాముళ్లు, తమను జనం నమ్మరు అని తెలిసీ, లేస్తే మనిషిని కాను అని అరుస్తూ ఆయాసపడిపోయే నేతాశ్రీలు

ఎన్ని కుట్రలు పన్నినా ఒరిగేదేం లేదు. ఎందుకంటే జగన్‌ కు జనమే శ్రీరామరక్ష

ఆర్వీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?