Advertisement

Advertisement


Home > Politics - Political News

మూడవ ముక్క రాజుగారికి వద్దుట...!

మూడవ ముక్క రాజుగారికి  వద్దుట...!

ఇదేదో కూరగాయల బేరంలా ఉంది చూస్తూంటే. అమరావతిలో రాజధాని ఉంది. అది కొందరికే పరిమితంగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో అభివ్రుధ్ధి జరగాలి అని వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన‌ను తీసుకువచ్చింది. అందులో భాగంగా శాసన రాజధాని అమరావతిలో ఉంటుంది. పాలనా రాజధాని విశాఖకు ఇచ్చారు. న్యాయ రాజధాని కర్నూలుకు తరలిపోతుంది.

మరి ఈ విభజన విజయనగరం రాజుగారికి అసలు నచ్చడంలేదుట. మాకు మూడవ వంతు రాజధాని ఇచ్చి సపోర్ట్ చేయమంటే ఎలా జగన్ అంటున్నారు అశోక్ గజపతిరాజావారు. 

పైగా విశాఖకు నీళ్ళు ఎలా తెస్తారని ప్రశ్నిస్తున్నారు. పోలవరం జగన్ ఆపేశారని కూడా చెబుతున్నారు. పరిశ్రమలు విశాఖలో పెద్ద ఎత్తున టీడీపీ హయాంలో వస్తే వాటీ జగన్ పనిగట్టుకుని వెళ్ళగొట్టారని కూడా అంటున్నారు.

ఇంత చేసినా న్యాయం ధర్మం ఉంది కాబట్టే శాసనమండలిలో అధికార వికేంద్రీకరణ బిల్లు  సెలెక్ట్ కమిటీకి వెళ్ళిందని కూడా ఆయన అంటున్నారు.

మెజారిటీ ఉంది కదా అని జగన్ ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటే మండలిలో జరిగిన కధ మళ్ళీ మళ్ళీ జరుగుతుందని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. 

మొత్తానికి రాజుగారికి మూడవ భాగం రాజధాని నచ్చలేదుట. ఇక మండలి తీరు భేష్ అని కూడా పొగుడుతున్నారు.  మొత్తం విశాఖకు రాజధాని తెచ్చేసినా రాజావారు నచ్చి మెచ్చి  ఓటేస్తారా బాబుకు చెక్క‌ భజన  చేయడమే తప్ప  అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

ఈ పప్పు నాయుడికి రాజకీయ బిక్ష పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?