Advertisement

Advertisement


Home > Politics - Political News

రాహుల్ కు రాందేవ్ సలహా, అధికారం ఖాయమట!

రాహుల్ కు రాందేవ్ సలహా, అధికారం ఖాయమట!

రాహుల్ గాంధీకి ఒక ఉచిత సలహా ఇచ్చారు  యోగాగురు రాందేవ్ బాబా. అధికారాన్ని అందుకునేందుకు ఒక దగ్గరి మార్గాన్ని చెప్పారాయన. రాహుల్ అలా చేస్తే ఆయనకు పవర్ గ్యారెంటీ అనే భరోసాను కూడా ఇచ్చారు ఈ కాషాయధారి. అదేమిటంటే.. యోగా చేయడం! 

ఔను.. వినడానికి ఆశ్చర్యకరంగానే ఉన్నా, రాందేవ్ మాత్రం రాహుల్ కు ఈ సలహా ఇచ్చారు. త్వరలోనే ఇంటర్నేషనల్ యోగా డే రాబోతూ ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ కు రాందేవ్ బాబా ఈ సలహా ఇచ్చారు. యోగా చేయడం ఆరంభించాలని, అధికారం అందుతుందని ఈ యోగాగురు రాహుల్ కు ఆశీర్వచనాలు ఇచ్చారు!

ఇందుకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు రాందేవ్. ప్రస్తుత ప్రధానమంత్రి పబ్లిక్ గా యోగా చేస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిర, ఆమె తండ్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఇద్దరూ.. కూడా యోగా చేసేవారని, అందుకే వారు ప్రధానమంత్రి పదవిని అనుభవించారని రాందేవ్ చెబుతున్నారు. 

అందుకే రాహుల్ కూడా మొదలుపెట్టాలని, ఆయనకు అధికారం సిద్ధిస్తుందని ఈ యోగా గురు సూచించారు. గత ఏడాది కూడా రాహుల్, సోనియాలకు రాందేవ్ ఈ సలహా ఇచ్చారు. అయితే అప్పుడు వారు పట్టించుకోలేదు. ఈసారి అయినా వారు యోగా డే రోజున ముందుకు వస్తారా?

ఆత్మవిమర్శ అవసరం.. దిక్కుతోచని స్థితిలోనే ఈ పనులు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?