cloudfront

Advertisement


Home > Politics - Political News

రామోజీరావు మనవరాలి పెళ్లి ఘనంగా..!

రామోజీరావు మనవరాలి పెళ్లి ఘనంగా..!
కొంతకాలం కిందటే రామోజీరావు ఒక మనవరాలి పెళ్లి చేశారు. అప్పుడు  ఆయన తనయుడు కిరణ్ కూతురు పెళ్లి ఘనంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు ప్రముఖులంతా హాజరయ్యారు. ఇప్పుడు  రామోజీ మరో మనవరాలి పెళ్లి అంతే ఘనంగా జరుగుతోంది.
 
ఇప్పుడు  రామోజీరావు రెండో కుమారుడు దివంగత సుమన్ కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. సుమన్, విజయేశ్వరిల కుమార్తె… వధువు పేరు కీర్తి సొహన కాగా వరుడి పేరు వినయ్ అని తెలుస్తోంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రమ వర్గాల ప్రముఖులు తరలి వెళ్లారు. 
 
ఈ వివాహ వేడుకకు హాజరైన వారిలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, మాజీ ఎంపీ రెబల్ స్టార్ కృష్ణం రాజు, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, ఎస్వీ కృష్ణా రెడ్డి, బోయపాటి శీను, అచ్చిరెడ్డి, చలపతిరావు, ఆర్.నారాయణ మూర్తి తదితరులున్నారు. సుప్రీం కోర్టు విశ్రవాంత న్యాయమూర్తి  జస్టిస్ జాస్తి చలమేశ్వరి,  సీవీసీ కేవీ చౌదరి తదితరులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.