Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇంటింటికీ రేషన్.. వెనకడుగేసిన జగన్

ఇంటింటికీ రేషన్.. వెనకడుగేసిన జగన్

అంతా అనుకున్నట్టు జరిగితే జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటి వద్దకే రేషన్ సరకుల పంపిణీ జరగాల్సి ఉంది. దీని కోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తులు పూర్తి చేసింది. రేషన్ సరకులు అందించడానికి వాహనాలు సిద్ధం చేసింది, డ్రైవర్ పోస్ట్ ల భర్తీని కూడా చేపట్టింది, సరకుల ప్యాకింగ్ కూడా జరుగుతోంది. కానీ అసలు విషయంలో చిక్కొచ్చి పడింది.

పోర్టబిలిటీ విధానాన్ని ఉపయోగించుకుని ఇప్పటికే చాలామంది వేర్వేరు ప్రాంతాల్లో రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. సొంతూరిలో లేకపోయినా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉండటంతో.. కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా వేలిముద్ర వేసి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఇంటింటికీ రేషన్ అంటే ఆ వెసులుబాటుని తీసేసినట్టే లెక్క.

దీనికి సంబంధించి రైస్ కార్డుల మ్యాపింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్టు తెలుస్తోంది. వాలంటీర్లు ఉత్సాహంగా ఉన్నా, రెవెన్యూ ఉద్యోగులు రెడీగా ఉన్నా కూడా లబ్ధిదారుల జాడ తెలియక చాలా చోట్ల రేషన్ కార్డుల మ్యాపింగ్ జరగలేదు. 

ఒకవేళ పట్టుబట్టి జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ చేరవేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినా.. తొలి నెలలోనే దాదాపు 20 శాతం మంది రేషన్ తీసుకునే అవకాశం కోల్పోతారు. 80 శాతం మందికి ఉపయోగం ఉన్నా కూడా 20 శాతం మంది పేదల శాపనార్థాలు తగులుతాయి.

అందుకే అధికారులు ఓ అడుగు వెనక్కి వేశారు. ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. దీనికి సంబంధించి రేషన్ డీలర్లకు అనధికారికంగా సమాచారం వెళ్లింది. వాలంటీర్ల శిక్షణా కార్యక్రమాలు, సమీక్షలు వాయిదా పడటంతో ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమం ఆగిపోయినట్టు అర్థమవుతోంది.

శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ గా ఇంటి వద్దరే రేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించారు. బాలారిష్టాలను దాటుకుని రేషన్ సరకుల పంపిణీ సజావుగానే సాగుతోంది. అయితే కొన్నిచోట్ల మాత్రం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

దీన్ని నిరంతర ప్రక్రియగా మార్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి అమలులోకి తేవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. దానికి అనుగుణంగానే అంతా సిద్ధమైంది. అయితే అనుకోకుండా చివరి నిమిషంలో ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమం ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడుతుంది. 

ఫెయిల్యూర్ సినిమా...ప్ర‌మోష‌న్ ఎపిసోడ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?