cloudfront

Advertisement


Home > Politics - Political News

రవిప్రకాష్, శివాజీ.. పోలీసులకు ఇ-మెయిల్!

రవిప్రకాష్, శివాజీ.. పోలీసులకు ఇ-మెయిల్!

ఫోర్జరీ తదితర కేసులను ఎదుర్కొంటూ పరారీలో ఉన్న టీవీ నైన్ మాజీ సీఈవో రవిప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇ-మెయిల్ పంపించినట్టుగా తెలుస్తోంది. తనపై నమోదు అయిన కేసుల్లో విచారణకు తనకు మరో పదిరోజుల పాటు గడువు కావాలని రవిప్రకాష్ ఆ మెయిల్ లో కోరినట్టుగా సమాచారం.

విశేషం ఏమిటంటే.. రవిప్రకాష్ సన్నిహితుడు శివాజీ కూడా ఇదే సమయంలో పోలీసులకు మెయిల్ పంపించాడట. తనకు ఆరోగ్యం బాగోలేదని కాబట్టి తనకు కూడా విచారణ నుంచి మినహాయింపును ఇవ్వాలని ఆయన కోరాడట. ఎంత సన్నిహితులు అయితే మాత్రం తమపై నమోదు అయిన కేసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి వీళ్లిద్దరూ ఇ మెయిల్ ఎత్తుగడనే వేయడం విశేషం.

అవతల పోలీసులు వీళ్ల కోసం తిరుగుతూ ఉన్నారు. నోటీసుల మీద నోటీసులు జారీచేశారు. వాటిని వీళ్ల ఇళ్లకు కూడా అతికించారు. కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ ప్రయత్నాలు, కేసులను కొట్టేయించుకునే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే అక్కడ కూడా వీళ్లకు భంగపాటు తప్పలేదు.

ఇలాంటి నేపథ్యంలో వీళ్లు... విచారణ కు తామే గడువును విధిస్తూ, పదిరోజులు, పక్షంరోజులు అంటూ వీళ్లే పోలీసులకు టైమ్ డిసైడ్ చేస్తుండటం గమనార్హం! 'రవి ప్రకాష్... ఇదేనా మెరుగైన సమాజం అంటే?'

సెక్స్ కు మనిషిని దూరం చేస్తున్న ఇంటర్నెట్!