Advertisement

Advertisement


Home > Politics - Political News

ఒకే ఒక్క‌డు మృత్యుంజ‌యుడు!

ఒకే ఒక్క‌డు మృత్యుంజ‌యుడు!

త‌మిళ‌నాడు ఘోర దుర్ఘ‌ట‌న‌లో 13 మంది దుర్మ‌ర‌ణం చెంద‌గా, ఒకే ఒక్క‌డు మృత్యుంజ‌యుడిగా నిలిచాడు. ఆ ఒక్క‌డు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కావ‌డం విశేషం. భార‌త సైన్యానికి చెందిన  ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ కుప్ప కూలడంతో రావ‌త్ భార్య మ‌ధులిక ప్రాణాలు కోల్పోయారు. 

అనూహ్యంగా ఈ ఘోర ప్ర‌మాదం నుంచి బిపిన్ రావ‌త్ ప్రాణాలు కాపాడుకోగ‌లిగారు. అయితే 80 శాతం కాలిన గాయాల‌తో ఆయ‌న మృత్యువుతో పోరాడుతున్న‌ట్టు స‌మాచారం. బిపిన్‌ రావత్‌కు వెల్లింగ్టన్‌ ఆర్మీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు పైన త‌మిళ‌నాడులోని కూనూరులో సాంకేతిక లోపంతో సైనిక విమానం కుప్ప కూలింది. మంట‌ల‌తో భీతావ‌హ వాతావ‌ర‌ణం క‌నిపించింది. ఈ హెలికాప్ట‌ర్‌లో త్రివిధ ద‌ళాల అధిప‌తి బిపిన్‌రావ‌త్‌, ఆయ‌న భార్య మ‌ధులిక‌తో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారని స‌మాచారం. మొత్తం  14 మందిలో కేవ‌లం బిపిన్ మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌డం అద్భుత‌మ‌నే చెప్పాలి.  

ప్ర‌మాదంలో హెలికాప్ట‌ర్ పూర్తిగా తునాతున‌క‌లైంది. మంట‌ల్లో స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. దీంతో మృత‌దేహాల‌ను గుర్తు ప‌ట్టలేని స్థితిలో ఉండటంతో డీఎన్‌ఏ టెస్టులు చేయ‌నున్నారు. అనంత‌రం మృత‌దేహాల‌ను కుటుంబ స‌భ్యుల‌కు అందించ‌నున్నారు. 

ఇదిలా వుండ‌గా హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురి కాగానే బిపిన్‌తో పాటు మ‌రో ముగ్గురు న‌లుగురు పైనుంచి దూకిన‌ట్టు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. అందువల్లే ఆయ‌న క‌నీసం ప్రాణాల‌ను కాపాడుకోగ‌లిగార‌ని ర‌క్ష‌ణ‌శాఖ అధికారులు చెబుతున్నారు. బిపిన్ రావ‌త్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని యావ‌త్ దేశ‌మంతా కోరుకుంటోంది.   

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?