cloudfront

Advertisement


Home > Politics - Political News

విశాఖను గ్రేటర్ చేసింది.. పులివెందుల నేత పవన్ గారూ!

విశాఖను గ్రేటర్ చేసింది.. పులివెందుల నేత పవన్ గారూ!

తల్లి కోసం ఫ్యాక్షన్ చేయని జగన్ భీమవరంకి పులివెందుల మనుషులను పంపుతారా? పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోకి పులివెందుల అల్లరిమూకలు ప్రవేశిస్తే తరిమికొట్టతాను అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం అభ్యంతరకరమే కాదు రాయలసీమ ప్రజలను అవమానించడం కూడా. అమరావతి రాజధాని అయినా నామనసులో మాత్రం కర్నూల్ రాజధాని అంటూ మీరు చేసిన ప్రకటన రాయలసీమ ప్రజలలో కొత్త ఆశలు చిగురించాయి. అలాంటి పవన్ కళ్యాణ్ భీమవరంలో సీమ ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరం.

విశాఖలో తల్లికోసం జగన్ ఫ్యాక్షన్ చేసినాడా పవన్... 2014 ఎన్నికల్లో జగన్ తన తల్లి విజయమ్మను విశాఖ పార్లమెంట్ స్థానంలో పోటీకిపెట్టారు. నాడు కూడా ఇలాంటి విమర్సలు చేసినారు. విజయమ్మ గెలిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని, పులివెందుల గుండాలు అశాంతిని కలిగిస్తారని ప్రచారం చేశారు. ప్రజలు కూడా నమ్మారు ఫలితం విజయమ్మ ఓడిపోయారు. ఇక్కడ గుర్తించుకోవలసింది తన తల్లి స్వయంగా పోటీచేసినా జగన్ తను పుట్టిన ప్రాంతం మీరు విమర్శిస్తున్న పులివెందుల మనుషులను పంపారా? లేదే!

నాటి ఎన్నికల్లో ఒక్క హింసాత్మక సంఘటన చోటుచేసుకోలేదు. తన తల్లి కోసం ఫ్యాక్షన్ చేయని జగన్ తనకు పోటీ కానీ మిమ్మల్ని ఓడించడానికి పులివెందుల మనుషులను పంపుతారా పవన్ ఒకేసారి ఆలోచించండి. నేటి విశాఖ నగరంలో ఆగడాలకు కారణం ఎవరు... నేడు విశాఖపట్నంలో వేలకోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం కాబడింది.

శాంతి భద్రతలు సరిగాలేదని  మీరే అనేకసార్లు విమర్శలు చేసినారు. ఆందోళన కూడా చేసినారు. ఏ పులివెందుల గుండాలు అందుకు కారణమో చెప్పగలరా. ఈ మొత్తం వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంది మీరు పెంచి పోషించిన వారు కాదు. అదే పులివెందుల ప్రాంతం నుంచి ఎన్నికైన వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే కదా విశాఖపట్నం గ్రేటర్ అయినది నాటి పాలనలో నేటి పరిణామాలు చోటు చేసుకున్నాయా పవన్ సమాధానం చెప్పాలి.

నిందలు వేయడం హీరోయిజం కాదు... వ్యక్తిగతంగా సినీ హీరో అయిన పవన్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హీరోయిజం అంటే ఇతరులపై నిందలు వేయడంకాదు. తనవారికి , తనచుట్టూ ఉన్నవారికి మేలు చేసి అభిమానం పొందడం. కానీ పవన్ అందుకు భిన్నంగా జగన్ మీదా రాయలసీమ ప్రజల మీదా నిందలు వేయడం ద్వారా విజయం సాధించాలనుకుంటున్నారు.

2014లో తన మద్దతుతో అధికారంలోకి వచ్చిన బాబు ప్రభుత్వంతో దాదాపు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నపుడు భీమవరంకి ఏమిచేసినారు, విడిపోయిన తర్వాత ఏ సమస్య పరిష్కారానికి పోరాటం చేసినారు, తనను గెలిపిస్తే భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఏమిచేస్తారు చెప్పి అక్కడ ప్రజల మద్దతు పొందవచ్చు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ సంబంధం లేని పులివెందుల ప్రజలపై నిందలు వేసి రాజకీయం చేయాలనుకుంటున్నారు అంటే ఇతరుల మీద నెపం మోపి తాను హీరో కావాలనుకుంటే అంతకన్నా దుర్మార్గం మరోటి ఉండదు. తనకు, తన కుటుంబానికి పెద్దదిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవిని మీ స్వంత ప్రాంతం ప్రజలు ఓడిస్తే రాయలసీమ ప్రజలు తిరుపతి నుంచి గెలిపించి మీకు రాజకీయ బిచ్చపెట్టారు. అలాంటి ప్రాంతంపైనా మీరు నిందలు వేసేది.

జగన్ రాజకీయాలుపై ఏ విమర్శలు చేసినా మాకు అభ్యంతరం లేదు. జగన్ పై కోపంతో వారు పుట్టిన రాయలసీమ ప్రజలపై నిందలు వేయడాన్ని సీమ సమాజం అంగీకరించదు. తమకు ఏమిచేశారు, ఏమి చేయబోతున్నారో చెప్పకుండా రాయలసీమ ప్రజలపై విషంచిమ్మితే విజ్ణత కలిగిన భీమవరం ప్రజలు కూడా హర్షించరు అని పవన్ కళ్యాణ్ గారు గుర్తించితే వారికే మంచిది.

-యం. పురుషోత్తమ రెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం, తిరుపతి.

అప్నా టైం ఆయేగా సాబ్ 

చెట్టు పేరుతో ఓట్లు అడుక్కోవడం.. ఎన్నాళ్లిలా