Advertisement

Advertisement


Home > Politics - Political News

విశాఖకు వచ్చేస్తాం!

విశాఖకు వచ్చేస్తాం!

విశాఖకు రావడం అంటే అందరికీ సరదానే. ఎందుకంటే ఇది సిటీ ఆఫ్ డెస్టనీ. అయితే అలా మామూలుగా రావడం కాదిపుడు, ఏకంగా సర్కారీ ఉద్యోగాలతోనే వచ్చేయడం. దాని మీద మెజారిటీ జాబ్ హోల్డర్లకు  ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే చల్లని వాతావరణం, పచ్చని చెట్లు, కొండలు ఇలా విశాఖ జాబ్ అంటే మధురమైన అనుభూతే మరి.

మన పోలీస్ పెద్ద డీజీపీ సాబ్ కూడా వైసీపీ సర్కార్ ఎపుడు అంటే అపుడు మేము విశాఖకు రావడానికిరెడీ అంటున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపధ్యంలో దానికి ఇపుడు  ముహూర్తం దగ్గరపడినట్లుగానే కనిపిస్తోంది.

ఓవైపు అమరావతి రాజధాని పేరిట 200 రోజుల పాటు ఆందోళనలు అంటూ ఎల్లో మీడియా పేజీలకు పేజీలు అంకితం చేస్తున్న వేళ విశాఖలో డీజీపీ టూర్ వేయడం ఇంటెరెస్టింగ్ పాయింట్. విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు ముఖ్య‌మైన పాలనా విభాగాలు అన్నీ కూడా వచ్చేస్తాయన్న దానికి సంకేతంగానే డీజీపీ టూర్ అంటున్నారు.

విశాఖకు రాజధాని తరలింపు మీద ప్రభుత్వ ప్రకటనే ఆలస్యం, వచ్చేసేందుకు మేము సిధ్ధమని డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటించాక ఇక కధ ఎంతో దూరంలో లేదని అంటున్నారు. మొత్తానికి రాజధానిగా విశాఖ త్వరలోనే తన సరికొత్త వైభవాన్ని చాటిచెప్పనుందన్నమాట.

ఇంత సక్సెస్ అస్సలు ఊహించలేదు

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?