cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అశ్లీల యూట్యూబ్ చాన‌ల్ ర‌ద్దుకు సిఫార్సు

అశ్లీల యూట్యూబ్ చాన‌ల్ ర‌ద్దుకు సిఫార్సు

ఓ అశ్లీల యూట్యూబ్ చాన‌ల్‌కు చెన్నైన‌గ‌రంలోని బీసెంట్‌న‌గ‌ర్ వాసులు గ‌ట్టిగా బుద్ధి చెప్పారు. వ్యూయ‌ర్స్‌ను పెంచుకుని, తద్వారా అక్ర‌మ మార్గంలో ఆదాయాన్ని పెంచుకోవాల‌నుకున్న స‌ద‌రు చాన‌ల్ నిర్వాహ‌కుల‌ను ప‌ట్టుకుని పోలీసులకు అప్ప‌గించారు.

చెన్నైకి చెందిన ఓ యూట్యూబ్ చాన‌ల్ ఫ్రాంక్ షో పేరిట ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంది. ఈ షోలో భాగంగా అశ్లీల ప్ర‌శ్న‌ల‌తో దిగ‌జారుడుకు ప‌రాకాష్ట‌గా నిలిచింది. ఫ్రీ ప్లాన్‌గా ముందే ఎంచుకున్న ఓ యువ‌తికి అశ్లీల ప్ర‌శ్న‌లు వేయ‌డం, స‌మాధానాలు రాబ‌ట్ట‌డం జ‌రిగిపోయాయి. 

ఈ క్ర‌మంలో మ‌రికొంద‌రి నుంచి ఇదే విధ‌మైన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. చాన‌ల్ ఉద్దేశాన్ని జ‌నం ప‌సిగ‌ట్టారు. ఈ నేప‌థ్యంలో బీసెంట్‌న‌గ‌ర్‌లో షూటింగ్ జ‌రుగుతుండ‌గా స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.  

పోలీసులు రంగంలోకి దిగారు.  అశ్లీలంతో కూడిన ప్రశ్నలు, సమాధానాలు, షోలు ఉండడంతో పోలీసులు లాఠీకి ప‌నిచెప్పారు.  చానల్ నిర్వాహ‌కుడితో పాటు  యాంకర్ , కెమెరామన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ప‌నిలో ప‌నిగా స‌ద‌రు  చానల్‌ను నిషేధించాలని యూ ట్యూబ్‌కు పోలీసులు సిఫారసు చేయడం విశేషం. 

ఈ సంక్రాంతి అల్లుడు నేనే 

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

 


×