cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆర్‌కే...ఎగ్గూ సిగ్గూ ఎందుకు చెప్పు!

ఆర్‌కే...ఎగ్గూ సిగ్గూ ఎందుకు చెప్పు!

సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీని క‌ల‌వ‌డానికి వెళుతున్నాడనే స‌మాచారం తెలియ‌గానే...ఏం రాయాలో ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉంటాడు. మోడీతో స‌మావేశం పూర్తి కావ‌డ‌మే ఆల‌స్యం....స్టోరీ బ్యాంక్‌లో ఉన్న క‌థ‌నాన్ని వెబ్ పేజీలో అప్‌లోడ్ చేస్తారు. ప్ర‌ధానితో జ‌గ‌న్‌ క‌ల‌యిక‌పై ఆంధ్ర‌జ్యోతిలో ఎలాంటి క‌థ‌నం వ‌స్తుందో ఊహించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

‘సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌ధాని మోడీ అక్షింత‌లు?’ అనే శీర్షిక‌తో ఆంధ్ర‌జ్యోతి ఇంట‌ర్నెట్ పేజీలో ఓ క‌థ‌నం ప్ర‌త్య‌క్ష‌మైంది. య‌జ‌మానిని బ‌ట్టి ప‌త్రిక లేదా చాన‌ల్ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్పొచ్చు. ఆర్‌కే నుంచి ఇంత‌కంటే ఉన్న‌త‌మైన రాత‌లు ఆశించ‌డం అత్యాశే అవుతుంది. ఇంకా న‌యం సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌ధాని మోడీ కొట్టాడ‌ని ఆర్‌కే రాయ‌నందుకు సంతోషించాలేమో.

ఎగ్గూ సిగ్గూ ఎందుకు చెప్పు
ఆత్మ‌గౌర‌వం ప‌ద‌వికి ముప్పు
 నిన్న‌టి మాట‌ను నేడు త‌ల‌వ‌కు
 నేటి మాట‌ను రేపు ఎత్త‌కు
 అదును చూసుకుని
ప‌ద‌వి చూసుకుని
పార్టీ మార్చ‌రా తిమ్మ‌న్న‌
 ప‌ల్టీ వేయ‌రా తిమ్మ‌న్న‌
 గెంత‌ర గెంత‌ర తిమ్మ‌న్న
గంతుల రంతుల తిమ్మ‌న్న‌...ప్ర‌సిద్ధ క‌వి గ‌జ్జ‌ల మ‌ల్లారెడ్డి రాసిన ఈ క‌విత్వం ఆంధ్ర‌జ్యోతి వార్త‌ను చ‌దువుతుంటే గుర్తొస్తోంది.

ఈ క‌విత్వంలోని ప్ర‌తి చ‌ర‌ణం మ‌న ఆర్‌కే సార్‌కు అన్వ‌యించుకోవ‌చ్చు.

ఆర్‌కే...ఎగ్గూ సిగ్గూ ఎందుకు చెప్పు, ఆత్మ‌గౌర‌వం జ‌ర్న‌లిజానికి, అక్ర‌మార్జ‌న‌కు ముప్పు...ఇలా ఎంతైనా, ఏమైనా రాసుకోవ‌చ్చు, చెప్పుకోవ‌చ్చు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ప్ర‌ధాని మోడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం ఏంటి? జ‌గ‌న్‌పై అక్షింత‌లు వేయ‌డం ఏంటి? అంత ఖ‌చ్చిత‌మైన స‌మాచారం ఉంటే క్వ‌శ్చ‌న్ మార్క్‌తో రాయ‌డం ఎందుకు ఆర్‌కే?

ప‌లు అంశాల‌పై జ‌గ‌న్‌ను ప్ర‌ధాని నిల‌దీసిన‌ట్టు ఆర్‌కేకు తెలుస్తోంద‌ట‌. పీపీఏ స‌మీక్ష‌ల‌పై ప్ర‌ధాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని, దావోస్‌లో ప్ర‌పంచ దేశాల ప్ర‌తినిధులంతా ఆందోళ‌న వ్య‌క్తం చేశార‌ని మోడీ ప్ర‌స్తావించార‌ట‌. అంతేకాదు, ఉద్యోగాల్లో స్థానికుల‌కే 75 శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై కూడా పారిశ్రామిక‌వేత్త‌లు అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని మోడీ గుర్తు చేశార‌ని...ఇలా ఆర్‌కే త‌న మార్క్ రాత‌లు అల్లాడు.  

ఈ సంద‌ర్భంగా ఆర్‌కేను ఒకే ఒక్క ప్ర‌శ్న అడుగుతున్నా. ఈ నెల 6వ తేదీ ఆంధ్ర‌జ్యోతి మెయిన్ పేజీలో ‘జ‌గ‌న్ క‌నిపిస్తే న‌రికేస్తారుః రామ‌కృష్ణ’ అనే శీర్షిక‌తో వార్త రాశారు. ఆ వార్త ఇలా ఉంది...తాడికొండ‌లో (చంద్ర‌బాబు స‌మ‌క్షంలో) సీపీఐ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ మాట్లాడుతూ ‘సీఎం జ‌గ‌న్ తుళ్లూరులో క‌నిపిస్తే మ‌హిళ‌లు ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తారు. అందుకే ఆయ‌న పోలీసుల్ని అడ్డు పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక గాడిద అమ‌రావ‌తిని స్మ‌శాన‌మంటాడు. వాడొక మంత్రి. వాడి పేరు బొత్స‌. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు భ‌య‌ప‌డి గుండు కొట్టించుకుని తిరుగుతున్నాడు. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎంతో శాంత‌మూర్తులు. 50 రోజులైనా శాంతియుతంగా ఉద్య‌మిస్తున్నారు. అదే మా రాయ‌ల‌సీమ‌లో అయితే ఎక్క‌డిక‌క్క‌డ ప‌గ‌ల‌గొట్టేవాళ్లం’ అని అచ్చు వేశారు.

కానీ తాను అలా మాట్లాడ‌లేద‌ని ఇదే రామ‌కృష్ణ ఆంధ్ర‌జ్యోతికి  ఓ ప్రెస్‌నోట్‌ను పంపాడు. ఆ నోట్‌లో ఏముందంటే ...

‘నిన్న (బుధ‌వారం) రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో జ‌రిగిన ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నేను సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్టుగా ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌లో వార్త‌ను వ‌క్రీక‌రించి ప్ర‌చురించారు. నేను ఆ విధంగా అన‌లేదు. అటువంటి వ్యాఖ్య‌ల‌కు, చ‌ర్య‌ల‌కు నేను వ్య‌తిరేకం. క‌మ్యూనిస్టులుగా రాజ‌కీయ ప‌ర‌మైన విమ‌ర్శ‌లు, పోరాటాలు చేస్తామే త‌ప్ప వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రితోనూ శ‌తృత్వం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నాం. మీ ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను ఖండిస్తున్నాం. ఆ ప్ర‌చురిత‌మైన వార్త‌లో పొర‌పాటుకు స‌వ‌ర‌ణ ప్ర‌చురించ‌వ‌ల‌సిందిగా కోరుతున్నాం’ అని  అదేరోజు విజ్ఞ‌ప్తి చేశాడు.

వంద‌లాది మంది పాల్గొన్న స‌భ‌లో ఒక జాతీయ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి మాట్లాడ‌ని మాట‌ల‌ను...మాట్లాడిన‌ట్టు రాసిన ఆంధ్ర‌జ్యోతి...నాలుగు గోడ‌ల మ‌ధ్య ప్ర‌ధాని, ఏపీ సీఎం మ‌ధ్య సంభాష‌ణ ఏం జ‌రిగిందో పిచ్చి రాత‌లు రాస్తే మాత్రం జ‌నం న‌మ్ముతార‌నుకుంటున్నావా ఆర్‌కే? బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన విష‌యాల‌ను ముందు క‌రెక్ట్‌గా రాయ‌డం చేత‌గాని ఆంధ్ర‌జ్యోతి..ఆ మ‌రుస‌టి రోజు ఖండ‌న వార్త‌ల‌ను ఎగ్గూసిగ్గూ లేకుండా ప్ర‌చురించుకోవ‌డం ఒక్క ఆర్‌కేకు మాత్ర‌మే చెల్లు.

తాజాగా సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌ధాని మోడీ అక్షింత‌లు? అని రాసిన ఆర్‌కేను....ఈ భూప్ర‌పంచంలో ఏ ప్రాణితో పోల్చినా, వాటిని అవ‌మానించ‌న‌ట్ట‌వుతుంది. ఇలాంటి ఎగ్గూసిగ్గూ లేని రాత‌ల‌ను రాసేవాళ్ల‌ను పిలిచేందుకు స‌రికొత్త ప‌దాల ఆవిష్క‌ర‌ణ అవ‌స‌రం.

 


×