Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆర్కే వలలో పడని షర్మిల

ఆర్కే వలలో పడని షర్మిల

వైఎస్ షర్మిలతో ఎబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వూ అంటూ గత రెండు మూడు రోజులుగా ప్రోమోలతో హడావుడి చేసారు. దీంతో వైఎస్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు కాస్త కలవరపడ్డమాట వాస్తవం. వైఎస్ ఫ్యామిలీ బద్ద వ్యతిరేకి అయిన మీడియాకు షర్మిల ఇంటర్వూ ఇవ్వడం అంటేనే వారు చాలా ఇబ్బంది పడ్డారు. అదంతా అయిపోయింది. ఇంటర్వూ ఇచ్చేసారు. ప్రసారం అయిపోయింది. షర్మిల ఏం చెబుతుందో, ఏం వివాదం వస్తుందో, ఎబిఎన్ ఆర్కే ఏ వివాదాస్పద ఇంటర్వూ చేస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూసిన మాట కూడా వాస్తవం.

అంతా టీ కప్పులో తుపాను మాదిరిగా ముగిసిపోయింది. నిజానికి ఇంటర్వూలో షర్మిల మాట్లాడిన మాటల కన్నా, ఆర్కే వేసిన ప్రశ్నలే ఎక్కువ వున్నాయి. ఎలాంటి ప్రశ్నలు అడిగినా షర్మిల అస్సలు తడబడకుండా, స్ధిమితంగా ఆలోచించి, నెమ్మదిగా, పద్దతిగా సమాధానాలు ఇచ్చుకుంటూ పోయారు. అస్సలు ఒక్క సారి కూడా మాట జారలేదు. ఎంత గిల్లి, గిచ్చి ప్రశ్నలు అడుగదాం అనుకున్నా, ఆమె చాలా జాగ్రత్తగా సమాధానాలు చెప్పుకుంటూ పోయారు.

జగన్ జైలుకు వెళ్తే సిఎమ్ కావడానికి తాను పార్టీ సభ్యురాలిని కూడా కాదని క్లారిటీ ఇచ్చేసారు. తను ఎంపీ పదవి అడగనే లేదని చెప్పేసారు. జగన్ తో గొడవలు కూర్చుని మాట్లాడకుంటే పరిష్కారం అయిపోయేవే తప్ప, కానివి కాదన్నారు. అయినా మీ ఇంట్లో గొడవలు లేవా అని ఆర్కేను కార్నర్ లోకి తోసే ప్రయత్నం చేసారు. ఆస్తుల గురించి లాగి లాగి అడిగనా, సింపుల్ గా వదిలేయ్ అన్నా అంటూ తప్పించారు.

ఆర్కే ఎంత ప్రయత్నించినా షర్మిల అస్సలు దొరకలేదు. ఎక్కడో ఒక చిన్న పాయింట్ దగ్గర పట్టుకుందామని ప్రయత్నించినా, ఊహాతీత ప్రశ్నలు అనేకం సంధించినా, తనదైన ముఖ కవళికలతో, తన నెమ్మదైన బాడీ లాంగ్వేజ్ తో, సున్నితంగా తప్పించుకుంటూ సమాధానాలు ముక్తసరిగా ఇచ్చుకుంటూ వెళ్లారు షర్మిల. టోటల్ గా అన్నకు తనకు విబేధాలు లేవని, ఆంధ్రలో పాలన ఎలా వుందో తనకు తెలియదని, తనకు అనవసరం అని,  ఇలా రకరకాలుగా స్పష్టమైన వివాదరహితమైన సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్లారు తప్ప, ఇంటర్వ్యూ సంచలనం కావడానికి కానీ ఆర్కే పాయింట్లను పట్టుకుని వాదనకు దిగడానికి కానీ ప్రయత్నించలేదు. సింపుల్ గా ఆలకిస్తూ వుండిపోయారు.

తనకు జగన్ కు మధ్య అంతా బాగానే వుందని స్పష్టం చేసారు. ఎంత గుచ్చి గుచ్చి ఎన్ని ఊహాతీత ప్రశ్నలు, ఆర్కే తన అభిప్రాయాలు రుద్దుతూ ప్రశ్నలు రంగరించినా షర్మిల దొరకలేదు. మొత్తానికి ఆర్కే రెండు మూడు సార్లు తనే స్వయంగా షర్మిల సమాధానాల పద్దతిని మెచ్చుకోకతప్పలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?