cloudfront

Advertisement


Home > Politics - Political News

ఆర్-ఆర్-ఆర్.. ఇది రాజమౌళి సినిమా కాదు

ఆర్-ఆర్-ఆర్.. ఇది రాజమౌళి సినిమా కాదు

ఆర్-ఆర్-ఆర్ అంటే రాజమౌళి సినిమా మాత్రమేనని అందరికీ తెలుసు. కానీ 2 రోజులుగా ఆర్-ఆర్-ఆర్ నిర్వచనం మారిపోయింది. ఆర్-ఆర్-ఆర్ అంటే రోజా-రోజా-రోజా. అంతలా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు రోజా. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా రోజా వార్తలే. అధికార ప్రతిపక్షాల్లో ఎవరు మాట్లాడినా రోజా టాపిక్కే. వెబ్ సైట్లు, వెబ్ ఛానెళ్ల సహా.. న్యూస్ ఛానెళ్లన్నీ రోజా వార్తల్నే వండివారుస్తున్నాయి.

రోజాకు ఎందుకు మంత్రిపదవి రాలేదు? రోజా అలిగిందా? రోజాకు ఇచ్చే నామినేటెడ్ పోస్ట్ ఏంటి? ఎన్నికల ఫలితాలపై ఎంత హాట్ డిస్కషన్ నడిచిందో, ఆ తర్వాత అంత హీట్ పెంచిన అంశం ఇదే అయింది. కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా రోజాకు మంత్రి పదవి ఇస్తే బాగుండేదని మాట్లాడారంటే.. పక్క రాష్ట్రంలో కూడా ఇది ఎంత హాట్ టాపిక్ గా మారిందో అర్థం చేసుకోవచ్చు.

రోజాను సీఎం జగన్ విజయవాడ పిలిపించారని, ఆమెకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నారని.. అన్నారు. తీరా రోజా జగన్ తో సమావేశమై విజయవాడ నుంచి వెళ్లిపోయారు కూడా. అయితే నామినేటెడ్ పోస్ట్ పై ఎలాంటి సమాచారం లేదు. రోజా అసంతృప్తిగా ఉన్నారా అంటే అదేమీ లేదని స్వయానా ఆమే మీడియాకు చెబుతున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా తనకు మంత్రి పదవి రాలేదన్న సమాచారం ఆమె దగ్గర కూడా ఉంది.

అయితే అగ్గిపుల్ల స్వాములు ఖాళీగా ఉంటారా? నామినేటెడ్ పోస్ట్ ఇస్తానన్నారట కదా, ఏ పోస్ట్ ఇస్తున్నారు? ఎప్పుడిస్తారు? రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గంలోకి తీసుకుంటారా.. అంటూ రకరకాల ప్రశ్నలతో రోజాని విసిగించారు. పదవులు ఆశించిన తాను ఎన్నికల్లో పోటీ చేయలేదని, జగన్ సీఎం కావడమే తమ లక్ష్యమని అది నెరవేరిందని, భవిష్యత్ లో మంత్రి పదవి లభిస్తుందనే ఆశ తనకు ఉందని రోజా చెప్పడంతో ప్రస్తుతానికి ఈ వివాదానికి ఇక్కడితో కామా పెట్టేశారు.

మొత్తమ్మీద ఈ మధ్యంతా రోజా వార్తలతో కాలక్షేపం చేశాయి ఛానెళ్లు. మంత్రి పదవులు ప్రకటించిన రోజే.. తోక పత్రికలు వివాదం రాజేయాలని చూసినా అది సాధ్యపడలేదు. చివరకు ఇతర పార్టీల నేతలు సైతం రోజాపై లేనిపోని సానుభూతి చూపిస్తూ.. వైసీపీలో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి రోజా వివరణతో ఇలాంటి వాళ్ల నోళ్లు మూతపడ్డాయనే అనుకోవాలి. 

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?