cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్యప్ప దర్శనం: నియమాలతో పాటు నిబంధనలు

అయ్యప్ప దర్శనం: నియమాలతో పాటు నిబంధనలు

అయ్యప్ప దీక్ష అంటేనే కఠినమైన నియమాలతో కూడుకున్నది. దీక్ష సమయంలో ఏమాత్రం అపవిత్రమైనా ఆ ప్రభావం కచ్చితంగా జీవితంపై పడుతుందనే భయం-నమ్మకం భక్తుల్లో అపారం. అయితే ఇప్పుడీ నియమాలకు తోడు అయ్యప్ప భక్తులు నిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన శబరిమల దర్శనాల్లో కఠిన నియమాలతో పాటు కచ్చితమైన నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు.

ఈరోజు నుంచి శబరిమలలో అయ్యప్ప భక్తులకు అనుమతి ఇచ్చారు. కరోనా కారణంగా కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. వీటిలో ముఖ్యమైనది కరోనా టెస్టు. పంబా చేరుకోవడానికి 48 గంటల ముందు ప్రతి భక్తుడు కచ్చితంగా కరోనా పరీక్ష చేయించుకోవాలి. యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చిన వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.

అంతేకాదు.. భక్తుల సంఖ్యలో కూడా పరిమితులు విధించింది దేవస్థానం. ప్రతి రోజూ 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. వచ్చినవాళ్లందరికీ విధిగా థర్మల్ చెక్ నిర్వహించిన తర్వాతే దర్శనం ప్రాప్తిస్తుంది. 

అంతకంటే ముందు దేవస్థానానికి చెందిన వెబ్ పోర్టర్ లో భక్తులు తమ వివరాల్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా పరిమితి ఉంది. రోజుకు వెయ్యి మందికి మాత్రమే ఈ పోర్టల్ లో రిజిస్టర్ చేయించుకోవడానికి అనుమతి.

దీంతో పాటు భక్తులు పవిత్రంగా భావించే పంబా నది స్నానాల్ని కూడా కేరళ ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు.. భక్తులు కొండపై బస చేయడాన్ని కూడా ఈసారి రద్దు చేశారు. ఈ రెండు నిబంధనలు భక్తుల్ని కాస్త బాధపెట్టేవే. ఎందుకంటే పంబా నదిలో స్నానం చేయడంతో పాటు కొండపైనే ఒక రాత్రి బస చేయడాన్ని అదృష్టంగా భావిస్తారు భక్తులు. ఈసారి ఈ రెండు దక్కవు.

నిజానికి శబరిమల ఆలయాన్ని నిన్ననే తెరిచారు. కానీ కరోనా నేపథ్యంలో తొలి రోజు భక్తులకు అవకాశం ఇవ్వలేదు. 7 నెలల తర్వాత తెరుచుకున్న శభరిమల ఆలయంలో ఈరోజు నుంచి భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. పదేళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రవేశం నిషేధించారు. 

ఈనాడు,జ్యోతి ప‌ట్టించుకోలేదు

నన్నెవడూ పీకలేడు

 


×