cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

క‌రోనాకు స‌బ్బం హ‌రి బ‌లి

క‌రోనాకు స‌బ్బం హ‌రి బ‌లి

మాజీ ఎంపీ, టీడీపీ సీనియ‌ర్ నేత స‌బ్బం హ‌రిని క‌రోనా మ‌హ‌మ్మారి బ‌లి తీసుకుంది. రెండు వారాల క్రితం ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డారు. ఇంట్లోనే రెండుమూడు రోజులు ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. 

ఆ త‌ర్వాత ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టం కావ‌డంతో కుటుంబ స‌భ్యులు విశాఖ‌లోని ఓ కార్పొరేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారం క్రితం ప‌రిస్థితి విష‌మించింద‌నే వార్త‌లొచ్చాయి. తిరిగి ఆయ‌న ఆరోగ్యం  స్థిరంగా ఉంద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

నిన్న మ‌ధ్యాహ్నం నుంచి మ‌ళ్లీ ప‌రిస్థితి తిర‌గ‌బ‌డిన‌ట్టు తెలిసింది. వెంటిలేట‌ర్‌పై ట్రీట్‌మెంట్ తీసుకుంటూ క‌రోనాపై పోరాటం సాగించారు. ఆ పోరాటంలో చివ‌రికి ఆయ‌న ఓడిపోయారు. ఈ రోజు 2 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న ఈ లోకాన్ని శాశ్వ‌తంగా వీడిన‌ట్టు వైద్యులు, కుటుంబ స‌భ్యులు తెలిపారు.  

కాంగ్రెస్ నేత‌గా రాజ‌కీయంగా అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ వ‌చ్చారు. విశాఖ మేయ‌ర్‌గా ప‌నిచేశారు. దివంగ‌త ముఖ్య మంత్రి వైఎస్సార్ ఆశీస్సుల‌తో అన‌కాప‌ల్లి ఎంపీగా గెలుపొందారు. వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ వెంట న‌డిచారు. అనంత‌రం రాజ‌కీయ విభేదాల కార‌ణంగా జ‌గ‌న్‌కు దూర‌మ‌య్యారు.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. స‌బ్బం హ‌రి మృతిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పాటు వివిధ రాజ‌కీయ ప‌క్షాల నేత‌లు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×