cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

సబ్బం హరి... పక్కా లోకల్

సబ్బం హరి... పక్కా లోకల్

విశాఖ జిల్లా రాజకీయాల్లో సబ్బం హరి విలక్షణ రాజకీయ నాయకుడు. ఆయన ఏ గాడ్ ఫాదర్ లేకుండానే కాంగ్రెస్ వంటి మహా సముద్రంలో 1980లలో ప్రవేశించి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆయనది నాలుగు పదుల రాజకీయం అయితే అందులో మూడున్నర పదులు కాంగ్రెస్ తోనే గడిచింది. సబ్బం హరి విశాఖ కాంగ్రెస్ రాజకీయాల్లో దిగ్గజం లాంటి ద్రోణంరాజు సత్యనారాయణనే ఢీ కొట్టి వేరే వర్గంగా కొనసాగారు.

ఇక ఆయన రాజకీయ జీవితంలో పదవులు అన్నీ అనూహ్యంగానే వరించాయి. 1995లో జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మేయర్ అయ్యారు. అప్పటికి మూడు నెలల క్రితం ఎన్టీయార్ నాయకత్వాన తెలుగుదేశం బ్రహ్మాండమైన మెజారిటీని సాధించింది.

దాంతో వెంటనే జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్ అవుతుందని భావించి నాడు పెద్ద నాయకులు ఎవరూ మేయర్ ఎన్నికల్లో పోటీకి ముందుకు రాలేదు. అలా ప్రత్యక్షవిధానంలో జరిగిన మేయర్ ఎన్నికలలో సబ్బం హరికి కాంగ్రెస్ టికెట్ దక్కడం ఆయన అనూహ్యంగా గెలవడం జరిగిపోయాయి.

ఇక 2009 ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ అనకాపల్లి ఎంపీ టికెట్ చివరి నిముషం వరకూ తేలలేదు, అక్కడ ఒక పత్రికాధిపతి టీడీపీ తరఫున పోటీ చేస్తే ప్రజారాజ్యం తరఫున చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పోటీకి దిగారు. 

పక్కా లోకల్ కార్డు తో హరి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అనూహ్యంగా బిగ్ షాట్స్ ని ఓడించి ఎంపీ అయ్యారు. ఇక సబ్బం హరి తన జీవితకాలమంతా ద్వేషించిన టీడీపీలో చేరడమూ భీమిలీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమూ అనూహ్యమే. 

ప్రతీ రోజూ టీవీల్లో కనిపిస్తూ వర్తమాన రాజకీయాల మీద తనదైన విశ్లేషణలు చేసే హరి కరోనా బారిన పడి సడెన్ గా ఈ లోకం వీడడం అనూహ్యమే. మొత్తానికి సబ్బం హరి మృతితో విశాఖ పాలిటిక్స్ లో స్థానిక నాయకుల శకం ముగిసింది అనే చెప్పాలి.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×