cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

విశాఖ ఆక్టోపస్ కి చాన్స్ వచ్చింది!

విశాఖ ఆక్టోపస్ కి చాన్స్ వచ్చింది!

జగన్ అంటే పక్కా ద్వేషంతో రగిలిపోయే కొందరు టీడీపీ నేతలకు  ఇపుడు కోతికి కొబ్బరి కాయ దొరికినంత  ఆనందం కనిపిస్తోంది. జగన్ ఒక సీనియర్ న్యాయ మూర్తి మీద ఫిర్యాదు చేస్తూ సీజేఐకి లేఖ రాశారు. మరో వైపు జగన్ మీద ఉన్న సీబీఐ కేసులు రోజూ వారీ విచారణకు వచ్చాయి.

దీంతో ఈ రెండింటిని ముడి పెట్టి  మరీ మాస్ మసాలా సినిమా చూపించేందుకు కొందరు స్క్రిప్టులతో సహా రెడీ అయిపోయారు. తనను తానే విశ్లేషకుడిగా చెప్పుకునే విశాఖ ఆక్టోపస్ సబ్బం హరి అసలే ఊరుకుంటారా.

ఆయన టీడీపీ అనుకూల చానల్ లో జగన్ మీద ఒక రేంజిలో రెచ్చిపోయారు. జగన్ జైలుకి వెళ్ళడం ఖాయమని జాతకం చూసి మరీ చెప్పేశారు. టైమ్ డేట్ మరీ కన్ ఫర్మ్ చేసేశారు. విశాఖ అక్టోపస్ జోస్యం ప్రకారం చూస్తే జగన్ వచ్చే ఏడాది మధ్యలోనే జైలు కి వెళ్తారట.

జమిలి ఎన్నికలు 2022లో జరుగుతాయని కూడా హరి జోస్యం చెప్పారు. ఆ సమయానికి వైసీపీ సీఎంగా జగన్ ఉండరంటూ కచ్చితమైన న్యూస్ గా చెప్పేశారు. మరి ఇది పచ్చ మీడియాకు పండుగ, పసుపు తమ్ముళ్ళకు కడుపులో పరమాన్నమే. ఇవన్నీ సరే కానీ చంద్రబాబు ఎపుడు సీఎం అవుతారో విశాఖ ఆక్టోపస్ చెప్పకపోవడమే  అసలైన ట్విస్ట్ మరి.

ఈనాడు,జ్యోతి ప‌ట్టించుకోలేదు

నన్నెవడూ పీకలేడు

 


×