
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియపై స్టే విధిస్తూ తీర్పు వచ్చినప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆనంద పరవశులు అయ్యారు. ఎన్నికలను తను బహిష్కరించడానికి, కోర్టు తీర్పుకూ ముడిపెట్టి చంద్రబాబు నాయుడు స్పందించారు. కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ ఈ ఎన్నికలను బహిష్కరించడం కరెక్టేనంటూ తన అనుకూల భాష్యాన్ని తనే చెప్పుకున్నారు.
అయితే ఇప్పుడు ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియకు డివిజన్ బెంచ్ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ ఎన్నికల నిర్వహణను ఆపడానికి వీల్లేదని పేర్కొంది. దీంతో రేపు యథాతథంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
మరి ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించినప్పుడు న్యాయం గెలిచినట్టుగా, తన బాధను న్యాయస్థానం అర్థం చేసుకున్నట్టుగా, తన వాదన రైటు అయినట్టుగా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయిపోయారు. అయితే ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాల మేరకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారో! న్యాయం గెలిచిందంటారో, ఓడిందంటారో!
తను బహిష్కరణ పిలుపు ఇవ్వడానికీ కోర్టు తీర్పుకూ ముడిపెట్టి సంబరపడిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు తన బహిష్కరణ పిలుపే అసమంజసం అంటే ఒప్పుకోవాల్సిందే కాబోలు. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రాదేశిక ఎన్నికల బహిష్కరణ పిలుపును పచ్చ చొక్కాలే పట్టించుకోలేదు.
అనేక చోట్ల తాము పోటీలో ఉన్నట్టే అంటూ పచ్చ పార్టీ నేతలు బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు కోర్టు తీర్పు కూడా ఎన్నికల నిర్వహణకే అనుకూలంగా వచ్చింది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు అన్ని రకాలుగానూ ఈ ఎన్నికలు ఎదురుదెబ్బలుగానే ఉన్నట్టున్నాయి.
పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా
నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను