Advertisement

Advertisement


Home > Politics - Political News

శభాష్ అనిపించేలా ఉక్కు కార్మికుల నిర్ణయం

శభాష్ అనిపించేలా ఉక్కు కార్మికుల నిర్ణయం

విశాఖ ఉక్కు కర్మాగారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. గత మూడు నెలలుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనపధంలో ఉన్న సంగతి విధితమే. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్త బంద్ కూడా గతంలో జరిగింది. 

ఇక కేంద్రం మొండి వైఖరికి నిరసనగా ఈ నెల 6న మరోసారి ఉక్కు బంద్ కి కార్మికులు పిలుపు ఇచ్చాయి. అయితే ఆ సమయాన దేశంలో కరోనా ఇంత పెద్ద ఎత్తున లేదు.

దాంతో ఇపుడు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నామని ఉక్కు కార్మిక నేతలు ప్రకటించారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆక్సిజన్ కొరత పట్టిపీడిస్తోంది. ఈ నేపధ్యంలో దేశానికే  ప్రాణదాతలా నిలిచిన విశాఖ ఉక్కు పెద్ద ఎత్తున ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తోంది.

ఈ విపత్కర పరిస్థితుల్లో బంద్ లు సమ్మెలతో ఆక్సిజన్ ఉత్పత్తి ఆపేయాలని భావించడం సమంజసం కాదు, అందుకే మా ఆందోళన‌ను వాయిదా వేసుకుంటున్నామంటూ కార్మికులు భేషైన నిర్ణయం తీసుకున్నారు. 

ఈ రోజున దేశంలోని ఎందరో ప్రాణాలు నిలబెడుతున్న ఉక్కు కర్మాగారం విషయంలో పాలకులు పీక నొక్కేసే విధానాలను ఆపి పునరాలోచన చేయాలని వారు అంటున్నారు.

మొత్తానికి ఉక్కు కార్మికులు తీసుకున్న ఈ ఉదాత్తమైన నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కరోనా తగ్గిన తరువాత అయినా కేంద్రం తన కఠిన నిర్ణయం మార్చుకుంటుందని అంతా ఆశిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?