Advertisement

Advertisement


Home > Politics - Political News

ఎన్టీఆర్‌కు అవ‌మానం!

ఎన్టీఆర్‌కు అవ‌మానం!

త‌మ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు దివంగ‌త ఎన్టీఆర్‌ను అవ‌మానించే రీతిలో క‌రోనా స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను టీడీపీ చేప‌ట్టింది. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేశామ‌ని కేవ‌లం ప్ర‌చారానికే త‌ప్ప‌, విప‌త్తులో కూడా టీడీపీ ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందించ‌డంలో నిబ‌ద్ధ‌త చూప‌లేక‌పోయింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్టీఆర్ లాంటి మ‌హానేత పేరుతో నిర్వ‌హిస్తున్న‌ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో క‌రోనా విప‌త్తులో మొక్కుబ‌డి వైద్య‌సేవ‌లు అందించ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు సొంత పార్టీ శ్రేణుల నుంచే ఎదురుకావ‌డం గ‌మ‌నార్హం. సోనూసూద్ లాంటి ఓ సాధార‌ణ న‌టుడు కోవిడ్ రోగుల‌కు ఆక్సిజ‌న్ అందించేందుకు ప్లాంట్ల‌నే నిర్మిస్తున్న ప‌రిస్థితి. అలాగే న‌టి, ద‌ర్శ‌కురాలు రేణూదేశాయ్ త‌న వంతు సాయం అందిస్తాన‌ని, నిజంగా ఆక్సిజ‌న్‌, బెడ్ సౌక‌ర్యం అవ‌స‌ర‌మైన వారు త‌న ఇన్‌స్టాకు మెసేజ్ పంపాల‌ని కోరిన విష‌యం తెలిసిందే.

అలాంటిది ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీని ఎక్కువ కాలం ప‌రిపాలించిన పార్టీగా, దాదాపు 40 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన పార్టీగా టీడీపీ ఓ వ్య‌వ‌స్థ‌ను నిర్మించుకుంది. ఏపీలో టీడీపీకి బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌ల బ‌లం ఉంది. ఒక్క పిలుపు ఇస్తే సాయం అందించ‌డానికి వేలాది మంది ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. టీడీపీ అధిష్టానం అనుకుంటే కోవిడ్ రోగుల‌కు ఆర్థికంగా, హార్థికంగా ఎంతో చేయొచ్చు.

కానీ ఆ ప‌ని చేయ‌కుండా తూతూ మంత్రంగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డం ఏంట‌నే పెద‌వి విరుపు మాట‌లు వినిపిస్తున్నాయి. టీడీపీ వ‌ర్గాలు చెబుతున్న‌ట్టుగానే ఇప్ప‌టి వ‌ర‌కూ 592 మంది వైద్య సాయానికి అభ్య‌ర్థిస్తే 351 మంది స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించారు. అలాగే వైద్య‌సాయం పొందిన వారిలో 185 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. టీడీపీ ప్ర‌క‌ట‌న‌లో కామెడీ కూడా లేక‌పోలేదు.

క‌రోనా విప‌త్తును ఎదుర్కోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌వుతున్నందున‌, టీడీపీ, ఎన్టీఆర్ ట్ర‌స్ట్ స‌మ‌ష్టిగా ఈ సేవా విభాగాన్ని ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఆ పార్టీ ఒక‌ ప్ర‌క‌ట‌న‌లో పార్టీ పేర్కొంది. మ‌రి విఫ‌ల‌మైన ప్ర‌భుత్వానికి 80 మంది అభ్య‌ర్థ‌న‌లు బ‌దిలీ చేయడం కామెడీ కాక మ‌రేంటి?  దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ పార్టీ నాయ‌కులు చెప్పాలి. 

అలాగే 98 మంది ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న కొన‌సాగుతోంద‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని టీడీపీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు. వ‌చ్చిందే 500 పైచిలుకు అభ్య‌ర్థ‌న‌లైతే, మ‌ళ్లీ ప‌రిశీల‌న ఏంటో ఏమీ అర్థం కావ‌డం లేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

అస‌లు ఎన్నిరోజుల క్రితం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక వైద్య విభాగం ఏర్పాటు చేశారు? ఏపీలో రోజుకు వేలాది కొత్త కోవిడ్ కేసులు వ‌స్తుంటే, ఎన్టీఆర్ ట్ర‌స్ట్ దృష్టికి కేవ‌లం 592 మంది మాత్ర‌మే వైద్యం కోసం అభ్య‌ర్థించ‌డాన్ని చూస్తే ...ఎలా అర్థం చేసు కోవాలి? ఆ ట్ర‌స్ట్ చేప‌ట్టిన వైద్య సేవ‌లపై జ‌నానికి ఉన్న విశ్వ‌స‌నీయ‌త ఏంటో ఈ లెక్కే చెబుతోంది. క‌నీసం టీడీపీ శ్రేణులు కూడా ట్ర‌స్ట్ భ‌వ‌న్ ఆధ్వ‌ర్యంలో అందిస్తున్న ఆన్‌లైన్ సేవ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోడానికి ముందుకు రాలేద‌ని తేలిపోయింది.

మ‌రీ ముఖ్యంగా ఏపీలో త‌మ పార్టీ సానుభూతిప‌రులైన వంద‌లాది మంది వైద్యులు, ఆస్ప‌త్రులు ఉండ‌గా, ఎక్క‌డో అమెరికాలో ఉన్న డాక్ట‌ర్ లోకేశ్వ‌ర‌రావు నేతృత్వం వ‌హించ‌డం ఏంటో? ఒక వ్య‌వ‌స్థ‌గా టీడీపీ కోవిడ్ రోగుల విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోయింద నేందుకు ఆ పార్టీ వెల్ల‌డించిన తాజా గణాంకాలే నిలువెత్తు నిద‌ర్శ‌నం. ఎన్టీఆర్ పేరుకు మ‌చ్చ‌తెచ్చేలా అధిష్టానం వ్య‌వ‌హ‌రిస్తోం ద‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

సొదుం ర‌మ‌ణ‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?