Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ ఇమేజ్ పెంచిన షర్మిల

జగన్ ఇమేజ్ పెంచిన షర్మిల

తెలంగాణలో షర్మిల వేస్తున్న తప్పటడుగులన్నీ పరోక్షంగా జగన్ ఇమేజీ పెంచుతున్నాయి. తాజాగా ఇందిరా శోభన్ వ్యవహారం మరోసారి జగన్ ని హైలెట్ చేసింది. ఇందిరా శోభన్ రాజీనామా తర్వాత, ఆమెపై గతంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు, స్టేజ్ పై షర్మిల బిహేవియర్ ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. యూట్యూబ్ లో 3-4 నెలల క్రితం సర్కులేట్ అయిన వీడియోలన్నీ మరోసారి వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా "మీరేం చేస్తున్నారు.. గాడిదలు కాస్తున్నారా" అనే వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది.

షర్మిల నోటి వెంట అలాంటి మాటలు, ఆ సందర్భంలో రావడాన్ని ఎవరూ సమర్థించడం లేదు. అదే సందర్భంలో అసలు జగన్ ఎలా ఉంటారు, తమ తోటి నాయకులతో ఆయన ఎలా మసలుకుంటారు, వారిని ఎలా గౌరవిస్తారు, స్టేజ్ పైకి జనాలు ఎక్కినా ఎంత సంతోషంగా వారిని ఎలా స్వాగతిస్తారు అనేది చర్చకు వస్తోంది.

జగన్ ప్రజల్లో ఎలా ఉంటారు, ప్రజలతో ఎలా ఉంటారనేది పాదయాత్రలో జనమంతా చూశారు. ఆ విషయంలో తండ్రి వైఎస్సార్ తో జగన్ పోటీ పడతారు. దగ్గరకు వచ్చినవారందర్నీ ఆప్యాయంగా పలకరిస్తారు. స్థాయీ భేదం లేకుండా వారితో కరచాలనం చేస్తారు. భుజంపై చెయ్యి వేసుకుని కలసి నడుస్తారు. వారింట్లో భోజనం చేస్తారు, అభిమానంగా ఏదిచ్చినా కాదనకుండా తీసుకుంటారు. గతంలో ఓదార్పు యాత్రలోనూ, ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలోనూ జగన్ ప్రవర్తనలో ఇసుమంతైనే తేడా లేదు.

కానీ షర్మిల మహిళ కావడంతో ఆమెకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఎవరూ కాదనలేరు. అంత మాత్రాన సాటి మహిళ అనే ఆలోచన లేకుండా షర్మిల నోరు జారడం మాత్రం ఆమె ఇమేజ్ ని డ్యామేజీ చేసింది, అదే సమయంలో జగన్ తీరు వేరే.. అనే మాట వినిపిస్తోంది.

నమ్మిన వారికోసం ఎందాకైనా..?

తనని నమ్ముకున్నవారు ఎంత చిన్నవారైనా జగన్ వదిలిపెట్టరు, తనని వ్యతిరేకించినవారు ఎంత పెద్దవారైనా వారిని పట్టించుకోరు. కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చినప్పుడు కొంతమంది ఆయనతో కలసి నడిచారు, మరికొందరు ఆయనతో విభేదించారు, కాంగ్రెస్ లోనే ఉంటూ జగన్ ని తీవ్రంగా విమర్శించారు. 

కాలక్రమంలో వారు కూడా తర్వాత జగన్ పంచన చేరాల్సి వచ్చింది. అందరినీ సమానంగా ఆదరించినా, మంత్రి పదవుల విషయంలో తన విజ్ఞత చూపించారు. ముందునుంచీ తనతో కలసి ఉన్నవారిని అన్నివేళలా ఆదరించారు జగన్.

స్థిత ప్రజ్ఞత అవసరం..

చుట్టూ ఉన్న పరిసరాలు చికాకుగా ఉండొచ్చు.. కానీ మనం సహనం కోల్పోకూడదు. ప్రత్యర్థులు రెచ్చగొట్టొచ్చు, కానీ మనం పరిస్థితులకు అనుగుణంగా నడచుకోవాలి. ఆ సహనం, ఓర్పు ఉంది కాబట్టే.. ఇప్పుడు మీరు కొట్టారు తీసుకున్నాం, మాకు టైమొస్తుంది మేము గట్టిగా కొడతాం అన్నారు జగన్. అన్నట్టే చేశారు. కానీ షర్మిలలో ఆ ఓర్పు, సహనం కనిపించడం లేదు. స్టేజ్ పైనుంచి జనాల్ని కిందకు దిగమనే క్రమంలో మైక్ చేతిలో ఉండగానే నోరు జారారు. సోషల్ మీడియాలో అదో పెద్ద రచ్చ కావడంతో ఏకంగా పెద్ద నాయకురాలే పార్టీని వీడారు.

ఇందిర నొచ్చుకున్నారని తెలిశాక అయినా ఆమెను పిలిపించుకుని మాట్లాడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ షర్మిల అలా చేయలేదు. అదే ప్లేస్ లో జగన్ ఉంటే.. షర్మిలలా ఆయన నోరు జారేవారు కాదు. పొరపాటున ఓ మాట అన్నా.. వెంటనే వారిని పిలిచి మాట్లాడేవారు, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేవారు. 

అందుకే 8 ఏళ్ల పాటు అధికారం లేకున్నా ఆయన వెంట నాయకులున్నారు, జనం నిలబడ్డారు. జనంతో ఎలా ఉండాలి, నాయకులతో ఎలా మెలగాలి అనే విషయంలో తండ్రి వైఎస్ఆర్ ని పదే పదే జగన్ గుర్తు చేస్తుంటారు. కానీ షర్మిలలో మాత్రం ఆ సెన్స్ మిస్ అయింది. అందుకే తెలంగాణలో పార్టీ పరిస్థితి అలా తయావుతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?