cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

టీడీపీ తమ్ముడికి అదిరిపోయే షాక్!

టీడీపీ తమ్ముడికి అదిరిపోయే షాక్!

పంచాయతీ ఎన్నికలు కాదు కానీ తెలుగుదేశం పార్టీ సీనియర్లకు గట్టిగానే షాకులు ఇస్తున్నాయి. ఇంతకాలం పంచాయతీలను తమ గుప్పిట పట్టి దశాబ్దాల పాటు ఏలిన వారికి ఈసారి జనంలో వచ్చిన చైతన్యం  ఏ మాత్రానా మింగుడు పడని విధంగా ఉందనుకోవాలి.

విశాఖ జిల్లాలో మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యానారాయణమూర్తికి సొంత ఊళ్ళోనే ఘోర పరాభవం ఎదురైంది. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా తమ ఆధీనంలోనే ఉన్న‌ వెన్నెలపాలెం పంచాయతీ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది.

బండారు భార్య మాధవీలత సర్పంచ్ గా పోటీ చేస్తే  వైసీపీ మద్దతుదారు వెన్నెల అప్పారావు 662 ఓట్ల తేడాతో ఓడించేశారు. ఇక ఈ పంచాయతీలోని పది వార్డులు కూడా వైసీపీ మద్దతుదారులు గెలవడంతో ఈ మాజీ మంత్రి సొంత పంచాయతీలోనే లెక్క తేలినట్లు అయింది.

ఇక ఇప్పటికి రెండు మార్లు బండారు సతీమణి పంచాయతీ సర్పంచ్ గా గెలిచి  పాలించారు. మరి ఈసారి మాత్రం జనాలకు వెగటు పుట్టుందో ఏమో కానీ టీడీపీ మద్దతుదారులను ఎవరినీ పంచాయతీ గడప తొక్కకుండా మొత్తానికి మొత్తం వైసీపీ మద్దతుదారులకే ఓట్లు గుద్దేశారు. 

గత సార్వత్రిక ఎన్నికల్లో పెందుర్తిలో యువకుడు అయిన వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మీద ఓడిన బండారు కి ఇపుడు ఇంట కూడా పరాజయం తప్పలేదు. మొత్తానికి ఈ ఓటమే  బండారు ను ఎక్కువ బాధించింది అంటున్నారు.

కుప్ప‌మా ?.. కుప్పిగంతులా ?

సాప్ట్ వేర్ జాబ్ చేసుకుంటూనే సినిమాల్లో న‌టించా

 


×