Advertisement

Advertisement


Home > Politics - Political News

షూటింగ్ అయిపోయింది...ఫ్లీజ్ లేవండి సార్‌!

షూటింగ్ అయిపోయింది...ఫ్లీజ్ లేవండి సార్‌!

కోటి విద్య‌లు కూటి కోస‌మే అని పెద్ద‌లు అన్నారు. కానీ కోటి న‌ట‌న‌లు ఓట్ల కోస‌మే అంటారు మ‌న 40 ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ పెద్దాయ‌న‌. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో సొంత నియోజ‌క వ‌ర్గంలోనే బొక్క బోల్తా ప‌డ్డ పెద్ద సార్‌కు...ఇప్పుడు పుర‌పాల‌క ఎన్నిక‌లు ద‌డ పుట్టిస్తున్నాయి. 

అస‌లే పుట్టి మునుగుతున్న పార్టీ త‌ర‌పున పోటీ చేసేవాళ్లే క‌రువ‌వుతున్న ప‌రిస్థితి. మ‌రో వైపు గెలిచిన త‌ర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించ‌డం ఎక్క‌డైనా విన్నాం, క‌న్నాం. కానీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌కుండానే నామినేష‌న్ల ద‌శ‌లోనే అధికార పార్టీలోకి ప్ర‌తిప‌క్ష పార్టీ అభ్య‌ర్థులు జంప్ అవుతుండ‌డం ఆయ‌న్ను క‌ల‌వ‌ర‌పెడుతోంది.

అధికార పార్టీ త‌న పార్టీ అభ్య‌ర్థుల్ని ఇలా ప్ర‌లోభ పెడితే ఎవ‌రికైనా బాధ ఉండ‌దాండి? ఉంటుంది. అందుకే త‌న ఆవేద‌న‌, ఆక్రోశాన్ని వెళ్ల‌గ‌క్కేందుకు పెద్ద సార్ స‌రికొత్త డ్రామాకు తెర‌లేపారు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి రెండు రోజులు కూడా గ‌డ‌వ‌క‌నే మ‌రోసారి సొంత జిల్లాకు వెళ్లాల్సిన దుస్థితి. ఈ నేప‌థ్యంలో రేణిగుంట విమానాశ్ర‌యంలో ఆయ‌న్ను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సంద‌ర్భంగా పోలీసులు, చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ చోటు చేసుకుంది. చిత్తూరు క‌లెక్ట‌ర్‌, తిరుప‌తి, చిత్తూరు ఎస్పీల‌కు వినతిప‌త్రాలు ఇచ్చి తిరిగి వెళ్తాన‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తికి పోలీసులు అంతే తెలివితేట‌ల‌తో తిర‌స్క‌రించారు. న‌ట‌న‌లో ఆయ‌న పీహెచ్‌డీ చేస్తే, తామేం త‌క్కువ కాద‌ని పోలీసులు కూడా వినూత్న రీతిలో దండాలు పెడుతూ ఓ అద్భుత డ్రామాను తెర‌కెక్కించి క‌నువిందు చేశారు.

ఈ సంద‌ర్భంగా పోలీసులు, చంద్ర‌బాబుకు మ‌ధ్య చోటు చేసుకున్న ఆసక్తిక‌ర సంభాష‌ణ‌పై నెటిజ‌న్లు త‌మ‌దైన రీతిలో సెటైర్లు విసురుతున్నారు. న‌ట‌న‌లో మామ‌కు మించిన ఘ‌నుడు, ఈ కాల‌పు మ‌హాన‌టుడు అని వ్యంగ్యంతో కూడిన పొగ‌డ్త‌లు వెల్లువెత్తుతున్నాయి.  

పోలీసులు: పర్మిషన్ ఇవ్వలేదు సార్.

పెద్ద‌సార్‌: కలెక్టర్, చిత్తూరు, తిరుపతి ఎస్పీలను నేను కలవాలి. ఆ ముగ్గురికి సమాచారం ఇవ్వండి.

పోలీసులు: ఓకే సార్.

పెద్ద‌సార్‌: నేను ప్రెస్‌తో మాట్లాడాలి. నేనెందుకు వచ్చానో చెప్పాలి కదా. నాకు ప్రాథమిక హక్కులు లేవా? ఇదేం దౌర్జన్యం. 14 ఏళ్లు సీఎంగా , 10 సంవ‌త్స‌రాల‌కు పైగా  ప్రతిపక్ష నేతగా ప‌నిచేశాను. ఈ విష‌యాల‌న్నీ తెలిసి కూడా న‌న్ను అడ్డుకోడానికి ఎంత ధైర్యం? ఏం తమాషాలు చేస్తున్నారా? మీరు పర్మిషన్ ఇవ్వ‌లేదు కాబ‌ట్టి ఇక్క‌డే నిర‌స‌న‌కు దిగుతున్నా.  

పోలీసులు: సార్‌, చ‌ల్ల‌కొచ్చి ముంత దాచ‌డం ఎందుకు? మీరు మ‌హాన‌టులు. మీర‌నుకున్న‌ట్టు కెమెరాలు ఆన్ చేయ‌మ‌ని చెప్పండి.  మీరు వచ్చిందే మీడియా అటెన్ష‌న్ కోస‌మ‌నే విష‌యం అంద‌రికీ తెలుసు. మీక్కావాల్సింది కూడా మేము అడ్డుకోడ‌మే క‌దా! స‌రే కానివ్వండి ...త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసుకోండి.

పెద్ద‌సార్‌: అది కాద‌య్యా, మీరు అలా నిజాలు మాట్లాడితే ఎలా?  నా మ‌న‌సు ఎంత బాధ‌ప‌డుతుందో మీకైనా అర్థ‌మ‌వుతుందా?  నేను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ‌డ్డీతో స‌హా మీ రుణం తీర్చుకుంటా జాగ్ర‌త్త‌. కలెక్టర్ దగ్గరకు, చిత్తూరు, తిరుపతి ఎస్పీల దగ్గరకు నేను వెళ్లాలి.

పోలీసులు: భ‌లే వాళ్లు సార్ మీరు. ఎక్క‌డైనా గొప్ప వాళ్ల  ద‌గ్గ‌రికి సామాన్యులు వ‌స్తారా?  లేక సామాన్యుల‌ ద‌గ్గ‌రికి  గొప్ప వాళ్లు వెళ్తారా? స‌్క్రిప్ట్ మార్చండి సార్‌.  

పెద్ద‌సార్‌: నా దగ్గరకొద్దు. నేనంత గొప్ప వ్యక్తిని కాదయ్యా. ద‌య‌చేసి న‌న్ను అక్క‌డికి తీసుకెళ్లండి. అక్క‌డ నా కోసం కెమెరాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు అర్థం చేసుకోరూ...

పోలీసులు: ఆంజ‌నేయుడి శ‌క్తి ఆ భ‌గ‌వానుడికే  తెలియ‌న‌ట్టు, మీరెంత గొప్ప‌వాళ్లు మీకు తెలియ‌దు సార్‌. 40 ఏళ్లుగా మీ న‌ట‌నను రాజ‌కీయ తెర‌పై చూస్తున్న ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు. కావున మీ అంత‌టి మ‌హాన‌టుల‌ను క‌లెక్ట‌ర్‌, చిత్తూరు, తిరుప‌తి ఎస్పీల ద‌గ్గ‌రికి పంపి ఎంత మాత్రం అవ‌మానించ‌లేం. ఫ్లీజ్ సార్‌...మీకు దండం పెడ‌తాం. మ‌రోసారి మీ నోట గొప్ప‌వాన్ని కాద‌నే మాట రానివ్వొద్దు.

పెద్ద‌సార్‌: నాకెందుకు గౌరవం. నా దగ్గరకు ఎందుకండి? నేనంత గొప్పోడిని కాదయ్యా అని చెబుతున్నా అర్థం కాదా?  లేక అర్థం కాన‌ట్టు న‌టిస్తున్నారా? అస‌లు న‌ట‌న‌పై పూర్తి పేటెంట్స్ నాకు మాత్ర‌మే ఉన్నాయి. అలాంట‌ప్పుడు నాకు దండం పెడుతూ... ఫ్లీజ్ సార్ అని వేడుకుంటూ నాకంటే న‌ట‌న‌లో మించి పోవ‌డం నాకు ఏ మాత్రం న‌చ్చ‌డం లేదు.  

పోలీసులుః సార్ మీర‌నుకున్న‌ట్టు మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం వ‌చ్చింది. షూటింగ్ షెడ్యూల్ ముగిసింది. మీర‌నుకున్న దాని కంటే సీన్స్ బాగా వ‌చ్చాయి. మిమ్మ‌ల్ని చూసి మాకు కూడా న‌ట‌న అబ్బింది సార్‌. థ్యాంక్స్ సార్‌. మీ కోసం స్పెష‌ల్ ప్లైట్ వ‌చ్చింది. ఫ్లీజ్ సార్‌, ఇక లేవండి. మీ చిత్ర యూనిట్‌తో తిరిగి బ‌య‌ల్దేరి వెళ్లిపోవ‌చ్చు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?