cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ల‌క్ష్మీపార్వ‌తి ఇంటికి చిన్న ఎన్టీఆర్‌

ల‌క్ష్మీపార్వ‌తి ఇంటికి చిన్న ఎన్టీఆర్‌

దివంగ‌త ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల‌పై ఆయ‌న భార్య‌, తెలుగు అకాడ‌మీ చైర్‌ప‌ర్స‌న్ నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. దివంగ‌త ఎన్టీఆర్ 25వ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్‌లోని ఆయ‌న‌ ఘాట్‌లో ల‌క్ష్మీపార్వ‌తి నివాళుల‌ర్పించారు. 

అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్ప నాయ‌కుడ‌న్నారు. ఎంతో మందికి ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచార‌న్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా సొంత కుటుంబ సభ్యులే అడ్డుపడ్డారని లక్ష్మీపార్వతి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే కేంద్రం పై ఒత్తిడి చేసి ఉంటే ఎప్పుడో వచ్చేదన్నారు. 

ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కేంద్రానికి లేఖ రాయాలని సీఎం జగన్‌ను కోరతాన‌ని ఆమె చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

జగన్‌మోహన్‌ రెడ్డి పాలన రామరాజ్యంలా కొనసాగుతోందని ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. త‌న‌ ఇంట్లోకి చిన్న ఎన్టీఆర్ వచ్చిన‌ట్టు ఆమె తెలిపారు. జనవరి ఒక‌టిన పుట్టిన ఆ బాబుకు అప్పుడే తాను ఎన్టీఆర్‌ అని పేరు పెట్టానన్నారు. 

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ఆ బాబును పెంచాలనుకుంటున్న‌ట్టు లక్ష్మీపార్వతి తెలిపారు. కాగా ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇస్తే ...భార్య‌గా ల‌క్ష్మీపార్వ‌తి అందుకుంటుంద‌నే కుట్ర‌తో ...అత్యున్న‌త పుర‌స్కారం రాకుండా అడ్డుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి.

చంద్ర‌బాబు పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

 


×