cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

వీర్యం పంచిన తండ్రి.. డేటింగ్ కు దూరమైన కొడుకు

వీర్యం పంచిన తండ్రి.. డేటింగ్ కు దూరమైన కొడుకు

ఇదొక విచిత్రమైన, బాధాకరమైన పరిస్థితి. ప్రపంచంలో ఏ కుర్రాడికి ఇలాంటి దీనావస్థ రాకూడదు. వయసుకొచ్చిన కుర్రాడు డేటింగ్ చేయలేని పరిస్థితి. దానికి కారణం అతడి తండ్రి. ఇంతకీ అతడి తండ్రి ఏం చేశాడో తెలుసా? అడిగినోళ్లందరికీ వీర్యం పంచాడు. దీంతో కొడుక్కి ఎవరితో డేటింగ్ చేయాలో అర్థంకావడం లేదు. ఎవర్ని టచ్ చేసినా చెల్లి లేదా అక్క వరస అవుతున్నారని బాధపడుతున్నాడు.

అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన జేవ్ ఫోర్స్ కు 24 ఏళ్లు. ఏదైనా డేటింగ్ యాప్ ఓపెన్ చేసి డేట్ చేద్దామంటే భయపడి ఛస్తున్నాడు. ఎందుకంటే.. అతడి తండ్రి ఓ పెద్ద వీర్య దాత. దాదాపు 500 సార్లు వీర్యం దానం చేశాడు. అలా వీర్యదానంతో పుట్టిపెరిగిన వాళ్లంతా, ఇప్పుడు జేవ్ ఫోర్స్ వయసువాళ్లయ్యారు.

ఈ నేపథ్యంలో.. పొరపాటును ఎవరితోనైనా ప్రేమలో పడితే ఆమె తన అక్క లేదా చెల్లెలు అవుతుందేమోనని భయపడుతున్నాడు జేవ్. ఆల్రెడీ ఇలా 2సార్లు అతడికి అనుభవం అయింది. దీంతో డేటింగ్ లేక ఇబ్బందిపడుతున్నాడు. తన వయసువాళ్లంతా ఎంచక్కా గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటే, మనోడు మాత్రం తోడు లేక తెగ ఇదైపోతున్నాడు.

ఇప్పటికే అలా 8 మంది సిస్టర్స్ ను కనిబెట్టాడు జేవ్. అందులో ఒకరు తన క్లాస్ మేట్ కూడా. అంతేకాదు.. తన తండ్రి వీర్యం ద్వారా జన్మించిన మరో ఇద్దరు కుర్రాళ్లు.. తన పక్క అపార్ట్ మెంట్ లోనే ఉన్నారనే విషయం తెలుసుకొని షాక్ అయ్యాడు. ఇలా ఊరంతా విత్తనాలు నాటిన జేవ్ తండ్రి.. కొడుక్కి తీరని అన్యాయం చేశాడు.  

విశాఖలో వైసీపీ ఓడిపోతే

కుప్ప‌మా ?.. కుప్పిగంతులా ?

 


×