cloudfront

Advertisement


Home > Politics - Political News

ఆయనకు మార్గం లేదు, పవన్ కు దిక్కులేదు!

ఆయనకు మార్గం లేదు, పవన్ కు దిక్కులేదు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు.. ఐదేళ్లు అనైతికంగా తెలుగుదేశం ఎంపీగా చలామణి అయ్యారు.. ఇప్పుడు జనసేనలోకి  చేరారు! ఇదీ ఎస్పీవై రెడ్డి కథ. చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చారు. ఇక మళ్లీ జగన్ వద్దకు ఏ మొహం పెట్టుకుని వెళ్లాలో అర్థం కాలేదు. ఏ బుట్టా రేణుక లాంటి వాళ్లు అయితే నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వారు. అయితే ఎస్పీవైకి కొంత నేపథ్యం ఉంది. దాంతో..మళ్లీ అటు వైపు వెళ్లడానికి సిగ్గు అడ్డు వచ్చింది.

అందుకే ఇప్పుడు  దాన్ని పూర్తిగా వదిలేసి జనసేనలోకి చేరిపోయారు! ఇక వేరే మార్గం లేదు పాపం. ఇక పవన్ కల్యాణ్ కు ఎస్పీవై లాంటి వాళ్లు మహా ప్రసాదం. ఎస్పీవైకి మార్గం లేదు, పవన్ కల్యాణ్ కు దిక్కులేదు.. అన్నట్టుగా ఉంది ఈ కథ.

ఎస్పీవై కుటుంబానికి జనసేన తరఫు నుంచి ఎన్ని  టికెట్లు దక్కుతాయో చూడాలి. నంద్యాల ఎంపీ, నంద్యాల ఎమ్మెల్యే టికెట్లు ఖాయమని అంటున్నారు. ఇలా నామినేషన్ల తుది గడువు సమయంలో వచ్చిన వారికి కూడా టికెట్లు ఇస్తుంటే… జనసేన టికెట్ల కోసం పరీక్షలు రాసిన వాళ్ల పరిస్థితి ఏమిటో!