cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

నెటిజ‌న్ల‌కు స్టార్ హీరో కుమార్తె వార్నింగ్‌

నెటిజ‌న్ల‌కు స్టార్ హీరో కుమార్తె వార్నింగ్‌

అంద‌రూ ఒకేలా ఆలోచించాల‌నే రూల్ లేదు. ఎవ‌రి అభిప్రాయాలు వాళ్లు త‌మ‌కు తోచిన విధంగా వ్య‌క్తం చేస్తూ ఉంటారు. వాటిని ప‌ట్టించుకోవ‌డం అంటే టైం వేస్ట్ చేయ‌డ‌మే. అయితే నెగెటివిటీని అంత సుల‌భంగా జీర్ణించుకునే  ప‌రిస్థితులు లేవు. వ్య‌తిరేకంగా చిన్న కామెంట్ చేసినా ...వాళ్లు అంతు చూడాల‌నే ధోర‌ణి పెరుగుతోంది. దీంతో వ్య‌వ‌స్థ‌లో ఒక ర‌క‌మైన ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంటోంది.

ఇదంతా ఎందుకంటే ... స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ గురించి నెటిజ‌న్లు నెగ‌టివ్ కామెంట్స్ పెట్ట‌డం, అవి ఆమెకు కోపం తెప్పించ‌డం, తిరిగి వారికి వార్నింగ్‌లు ఇవ్వ‌డం లాంటి త‌తంగం చోటు చేసుకున్న నేప‌థ్యంలో చ‌ర్చించుకోవాల్సి వ‌చ్చింది. ఈ నెల 10వ తేదీన ప్ర‌పంచ మాన‌సిక ఆరోగ్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆమిర్‌ఖాన్ కుమార్తె ఇరా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది.

నాలుగేళ్లుగా తాను డిఫ్రెష‌న్‌తో బాధ ప‌డుతున్నాన‌ని ,దాని నుంచి బయటపడేందుకు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాన‌ని,  ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్న‌ట్టు ఆ వీడియోలో ఇరా చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై నెటిజన్ల స్పంద‌న మిశ్ర‌మంగా ఉంది. 

త‌న మానసిక స‌మ‌స్య‌పై బ‌హిరంగంగా చెప్ప‌డం వ‌ల్ల‌, అలాంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి నైతికంగా స‌పోర్ట్ ఇచ్చిన‌ట్టైంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు అభినందించారు. ఇదే స‌మ‌యంలో మ‌రికొంత మంది మాత్రం స‌హ‌జంగానే ఇరాను హ‌ర్ట్ చేసేలా నెగెటివ్ కామెంట్స్ పెట్టారు.  

నెగెటివ్ కామెంట్స్‌పై ఇరాఖాన్ తాజాగా స్పందించారు.  ‘ఒకవేళ మీరు నెగెటివ్‌ కామెంట్లు పెడితే నేను వాటిని నా పోస్ట్‌ నుంచి తొలగిస్తా. మరోసారి ఇలా చేస్తే మీరు నా పోస్ట్‌లు చూడకుండా బ్లాక్‌ చేస్తా’ అంటూ నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ చేస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు వెనుకాడ‌న‌ని తీవ్ర స్వ‌రంతో  హెచ్చరించారు. 

ఇరా వార్నింగ్ ఎపిసోడ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అస‌లు అలాంటి నెగెటివ్ అంశాల్ని ప‌ట్టించుకోవ‌డం మ‌రింత ఎక్కువ ట్రోల్ చేస్తార‌ని, కావున వాళ్ల గురించి ఆలోచించ‌క‌పోవ‌డ‌మే మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కృష్ణమ్మ పరవళ్లు

 


×