cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

బీజేపీ మీద స్ట్రాంగ్ అటాక్ ....?

బీజేపీ మీద స్ట్రాంగ్ అటాక్ ....?

దేశంలో మోడీని, బీజేపీని అనే సాహసం ఎవరూ నిన్నటిదాకా చేయని పరిస్థితి ఉంది. ఇక ఏపీలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబు మోడీని పల్లెత్తు మాట అనరు అన్న ప్రచారం ఉంది.

ఈ నేపధ్యంలో అదే పార్టీకి చెందిన  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అయితే బీజేపీ మీద గట్టిగానే మాటల దాడి చేశారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి సరైన గుణపాఠం అంటూ శిరీష అనడం ఆశ్చర్యకరమే అని చెప్పాలి.

దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అన్న విధానంతో బీజేపీ పెద్దలు వ్యవహరిస్తే ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలకే జనాలు పట్టం కట్టి బీజేపీని ఓడించారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ఇదే తీరున దేశంలో మార్పు వస్తుందని కూడా ఆమె అంటున్నారు.

మొత్తానికి మోడీ పార్టీ ఓడినా కూడా చంద్రబాబు నుంచి ఏ కామెంట్ రాలేదు కానీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన శిరీష ఇలా ఘాటుగా కౌంటర్లేయడం కాషాయ దళానికి కషాయం తాగించినట్లుగానే ఉంది. అవును మరి శిరీష ఎంతైనా బీసీ నేత సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు కదా. ఆ తెగువా దూకుడూ ఎక్కడకు పోతాయని అంటున్నారు. 

మరి తమ పార్టీ చెల్లెమ్మ బీజేపీని ఇలా చెడుగుడు ఆడుతూ విమర్శిస్తూంటే బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×