Advertisement

Advertisement


Home > Politics - Political News

సుజనా.. తిట్టించుకోవడం అంత సరదానా.!

సుజనా.. తిట్టించుకోవడం అంత సరదానా.!

మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుజనా చౌదరి, క్రికెట్‌ జట్టులో 13వ ప్లేయర్‌ లాంటోడట. అస్సలేమాత్రం ఆయనకి పనీ పాటా వుండదట. బ్యాంకుల్ని ముంచేసిన కేసుల్లో ఇరుక్కుపోయి, బీజేపీ నీడన దాక్కున్నాడట. తెలుగుదేశం పార్టీకి - భారతీయ జనతా పార్టీకీ మధ్య బ్రోకర్‌గా, తాబేదార్‌గా వ్యవహరిస్తున్నారట. వినడానికి వీల్లేని స్థాయిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు సుజనా చౌదరిపై దుమ్మెత్తి పోశారు.

చిత్రమేంటంటే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలెవరూ బీజేపీని పెద్దగా విమర్శించలేదు. నిజానికి వారికి ఆ అవసరం కూడా లేదు. ప్రభుత్వాల స్థాయిలో కేంద్రం - రాష్ట్రం మధ్య విభేద్దాలేవనీ, తమ పార్టీకి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రుల్ని కలుస్తారనీ చెబుతున్న వైసీపీ నేతలు, సుజనా చౌదరి మాత్రం.. బీజేపీలో చేరినా టీడీపీ వాసనల్ని వదులుకోలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.

ఇంతలా సుజనా చౌదరి, వైఎస్సార్సీపీ నేతలతో ఎందుకు తిట్టించుకున్నట్లు.? అంటే, వైసీపీకి చెందిన 10 మంది ఎంపీలు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలు బీజేపాతో టచ్‌లో వున్నారని ఆయన చెప్పడమే అందుకు కారణం. తిట్టించుకోవాలనే సరదా సుజనా చౌదరికి వుందనే విషయం తేటతెల్లమయిపోయింది. వైసీపీ నేతలు, సుజనా చౌదరి సరదా కూడా తీర్చేశారు.

నిజానికి, బీజేపీలో జీవీఎల్‌ నరసింహారావు, విష్ణువర్ధన్‌రెడ్డి, రఘురామ్‌.. ఇలా ఎప్పటినుంచో 'కమలం' జెండా మోస్తున్న నేతలున్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడూ ఏపీ నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలూ తమ వైపు చూస్తున్నారని చెబుతున్నారు తప్ప, సుజనా చౌదరిలా అడ్డగోలు వ్యాఖ్యలు చేయలేదు. వైసీపీ మీద బురద జల్లే క్రమంలో పాపం సుజనా తన పాత బాస్‌ చంద్రబాబు మీద కూడా నాలుగు విమర్శలు చేయాల్సి వస్తోంది. పాపం, అంతలా కష్టపడుతున్నా సుజనాచౌదరి వ్యూహాలు ఫలించడంలేదు.

ఏదో ఒకటి చేసి, ఆంధ్రప్రదేశ్‌లో తనకూ రాజకీయంగా కొంత 'పట్టు' వుందని నిరూపించుకోవాలనే తాపత్రయం సుజనా చౌదరిది. ఈ క్రమంలోనే సుజనా అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇదిగో ఇలా అడ్డంగా బుక్కయిపోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?