cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

శృంగారం.. ఈ విషయంలో వీళ్లు 'పోటుగాళ్లు'

శృంగారం.. ఈ విషయంలో వీళ్లు 'పోటుగాళ్లు'

శృంగార జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించేది ఎవరు? ఎక్కువసేపు శృంగారంలో ఎవరు పాల్గొంటున్నారు? టీనేజ్ వచ్చిన వెంటనే తోడు కోరుకునే కుర్రాళ్లు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ తాజాగా నిర్వహించిన ఓ సర్వే సమాధానంగా నిలిచింది.

ఎక్కువగా శృంగారంలో పాల్గొంటున్న వ్యక్తుల్లో (పురుషులు/స్త్రీలు) గ్రీకులు ముందువరసలో ఉన్నారు. గ్రీకుల్లో దాదాపు 89శాతం మంది సగటున వారంలో ఒకసారైనా సెక్స్ జీవితాన్ని అనుభవిస్తున్నారు. 26 దేశాలకు చెందిన 30వేల మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది.

ఈ విషయంలో గ్రీకుల తర్వాత బ్రెజీలియన్స్ రెండో స్థానంలో, రష్యన్లు మూడో స్థానంలో నిలిచారు. బ్రెజిల్ లో 85శాతం మంది, రష్యన్లలో 80శాతం మంది తాము వారంలో కనీసం ఒకసారైనా సెక్స్ లో పాల్గొంటామని చెబుతున్నారు.

అయితే సెక్స్ చేయడం వేరు, సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయడం వేరు. ఈ విషయంలో అందరికంటే నైజీరియన్లు ముందున్నారు. తాము కేవలం సెక్స్ చేయడం కాకుండా.. దాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నామని 69శాతం మంది నైజీరియన్లు పేర్కొన్నారు. వీళ్ల తర్వాత మెక్సికన్లు, భారతీయులు సెక్స్ ను పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నామని పేర్కొన్నారు. 

ఎన్నిసార్లు సెక్స్ చేశామనేది ముఖ్యంకాదని, ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశామనేది ముఖ్యమని భారతీయులు వాదిస్తున్నారు. ఇక ఎక్కువసేపు శృంగారాన్ని అనుభవించే విషయంలో కూడా గ్రీకులు, నైజీరియన్లు పోటీపడుతున్నారు. 

ఈ దేశస్తులు సగటున ఒక సెషన్ లో 21 నిమిషాల పాటు తమ భాగస్వామితో శంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయంలో అందరికంటే జపనీయులు వెనకబడి ఉన్నారు. నిత్యం పనితో సతమతమయ్యే ఈ దేశీయుల్లో కేవలం 34శాతం మంది మాత్రమే తాము వారంలో కనీసం ఒకసారైనా సెక్స్ లో పాల్గొంటామని చెబుతున్నారు. 

ఉప్పెనంత వసూళ్లు

ఇప్పుడే ఎందుకు పార్టీ పెట్టాలి?

 


×