cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

వెనుకంజలో.. కాంగ్రెస్ 'ముఖ్యమంత్రులు'!

వెనుకంజలో.. కాంగ్రెస్ 'ముఖ్యమంత్రులు'!

పార్టీ గెలిస్తే తామే ముఖ్యమంత్రులం అవుతామని అనుకున్న, ప్రకటించుకున్న కాంగ్రెస్ నేతలు కనీసం ఎమ్మెల్యేలుగా గెలవడం కష్టం అవుతోంది. వీరి ఓటమి ఖాయం కాలేదు కానీ..  కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులు తొలి తొలి రౌండ్స్ లో వెనుకంజలో ఉండటం గమనార్హం. 

సీఎల్పీ లీడర్ జానా రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ.. ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్న మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, కొడంగల్ లో రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ.. వీళ్లంతా కూడా తొలి తొలి రౌండ్స్ లో వెనుకబడి ఉండటం విశేషం. అలాగే సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా జగిత్యాలలో వెనుబడి ఉన్నారు.

కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే తొలి రౌండ్స్ లో ముందంజలో కనిపిస్తూ ఉన్నాడు. ఇతర ముఖ్యమంత్రి అభ్యర్థులంతా ఓటమి బాట పట్టడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డికి లైన్ క్లియర్  అవుతున్నట్టే. అయితే కాంగ్రెస్ పార్టీకే తెలంగాణలో పరువు పోయేలా ఉంది. 

నిన్నటి వరకూ అయితే కాంగ్రెస్ వాళ్లు చాలా హడావుడి చేశారు కానీ.. ఫలితాల్లో మాత్రం బోర్లా పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎనభైకి పైగా సీట్లలో ఆధిక్యతతో దూసుకుపోతోంది. కారు స్పీడు వందకు టచ్ అవుతందా అనే సందేహాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కారు వేగం ముందుకు హస్తం, సైకిల్.. కకావికలం అయిన పరిస్థితి కనిపిస్తోంది.