Advertisement

Advertisement


Home > Politics - Political News

తిరుప‌తిలో వ్యూహాత్మ‌క త‌ప్పిదం

తిరుప‌తిలో వ్యూహాత్మ‌క త‌ప్పిదం

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రిపై వైఎస్ జ‌గ‌న్‌పై రాజ‌కీయ తూటా పేల్చేందుకు టీడీపీ, దాని అనుబంధ మీడియా ఇత‌రుల భుజాల‌పై గ‌న్ పెడుతుంటోంది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నం నెర‌వేరాలి, ఇదే స‌మ‌యంలో ఆ పాపం  ఇత‌రుల‌పై పోవాల‌నేది వారి ఎత్తుగ‌డ‌. 

ఇది చాలా కాలంగా న‌డుస్తున్న‌దే. అయితే జ‌గ‌న్ ఎత్తుగ‌డ ముందు వీటికి కాలం చెల్లింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా టీడీపీ, దాని అనుబంధ ఎల్లో మీడియా వ్యూహాత్మ‌క త‌ప్పిదానికి పాల్ప‌డుతున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి. 

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను బూచిగా చూపి అధికార పార్టీని ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నంలో తామేం కోల్పోతున్నామో గ్ర‌హించలేక టీడీపీ, అనుబంధ మీడియా బోల్తా కొట్టాయ‌ని సొంత పార్టీ శ్రేణులే విమ‌ర్శిస్తున్నాయి. ఈ నెల 14న తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వ‌స్తున్నారు. జ‌గ‌న్ రాక‌పై ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రికి తోచిన‌ట్టు వారు భాష్యాలు చెబుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా టీడీపీ, ఎల్లో మీడియా స‌రికొత్త వాద‌న తెర‌పైకి తేవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌చారానికి వ‌చ్చిన నేప‌థ్యంలో వైసీపీ త‌న మెజార్టీ అమాంతం ఎక్క‌డ ప‌డిపోతుందోన‌నే భ‌యంతో జ‌గ‌న్ ప్ర‌చారానికి రాక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి త‌లెత్తింద‌నే వాద‌న‌ను తెరపైకి తెచ్చారు. 

ఇది నిజ‌మేన‌ని కాసేపు అనుకుందాం. మ‌రి కొన్ని రోజులుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న నారా లోకేశ్ మాటేంటి? అలాగే నేటి నుంచి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న చంద్ర‌బాబు ప్ర‌భావం సంగ‌తేంట‌నే ప్ర‌శ్న‌లు టీడీపీ శ్రేణుల నుంచే రావ‌డం గ‌మ‌నార్హం.

ప‌వ‌న్‌కల్యాణ్‌ను చూసి జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నార‌ని మ‌న‌మే ప్ర‌చారం చేస్తే ....ఇక లోకేశ్‌, చంద్ర‌బాబు అంటే ఎలాంటి ప్ర‌భావం చూపలేని నాయ‌కులుగా మ‌న‌కు మ‌న‌మే ముద్ర వేసిన‌ట్టు కాదా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఇది మ‌న చేత్తోనే మ‌న క‌ళ్ల‌ను పొడుచుకున్న‌ట్టు కాదా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

జ‌గ‌న్‌ను బ‌ద్నాం చేసే క్ర‌మంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను అన‌వ‌స‌రంగా రాజ‌కీయ హీరో చేస్తున్నార‌ని, మ‌రోవైపు ఎటూ చెల్ల‌ని నాణేలుగా లోకేశ్‌, చంద్ర‌బాబు మిగిలిపోతున్నార‌నేది టీడీపీ శ్రేణుల ఆవేద‌న‌. మొత్తానికి తిరుప‌తిలో పోటీ జ‌గ‌న్ వ‌ర్సెస్ ప‌వ‌న్ అనే సీన్ క్రియేట్ చేస్తుండ‌డంతో టీడీపీ నాయ‌క‌త్వంపై శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?