Advertisement

Advertisement


Home > Politics - Political News

మేనిఫెస్టోతో పరువు పోగోట్టుకుంటున్న టీడీపీ

మేనిఫెస్టోతో పరువు పోగోట్టుకుంటున్న టీడీపీ

పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసి, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ రచ్చ చేసి.. తీరా దానిపై వేసిన కేసుకి అర్థం లేకుండా చేసి నవ్వులపాలయింది టీడీపీ. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో మేనిఫెస్టో పేరుతో మరింతగా పరువు పోగొట్టుకుంది. 

అన్న క్యాంటీన్లు తెరుస్తాం, ఆటో డ్రైవర్లకు టాయిలెట్లు కట్టిస్తాం, ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేస్తామంటూ పదిరకాల హామీలిచ్చింది టీడీపీ. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు, ఇప్పుడు కొత్తగా మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోని ఎలా అమలు చేస్తారంటూ లాజిక్ తీస్తున్నారు వైసీపీ నేతలు. 

అధికారంలోకి వచ్చాక అన్నక్యాంటీన్లు, నిరుద్యోగ భృతి అంటూ గత ఎన్నికలకు ముందు రెచ్చిపోయిన టీడీపీ.. ఎన్నికల ఏడాది ముంచుకొచ్చిన తర్వాత వాటిని అమలులో పెట్టింది. హడావిడిగా క్యాంటీన్లు పెట్టి, టీడీపీ కార్యకర్తలకు నిరుద్యోగ భృతి ఇచ్చి మమ అనిపించింది. వైసీపీ ప్రభుత్వం ఈ క్యాంటీన్లను వార్డు సచివాలయాలుగా మార్చేసింది, మిగిలిన వాటిని ఆప్కోకి ఇచ్చేస్తామంది.

ఇక మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నికైతే టీడీపీ నేతలకు క్యాంటీన్లు తెరిచే అధికారాలుంటాయా అనేదే ప్రశ్నార్థకం. అధికారంలో ఉన్నప్పుడే హామీలు నెరవేర్చలేని టీడీపీకి, ఇప్పుడు ప్రతిపక్షంలో, అందులోనూ 19మంది ఎమ్మెల్యేల కనిష్టబలంతో ఉన్నప్పుడు హామీలు నెరవేర్చే స్కోప్ ఆ పార్టీకి ఉంటుందా..? మొత్తమ్మీద మేనిఫెస్టో పేరుతో మరోసారి టీడీపీ నేతలు జిమ్మిక్కులు చేస్తున్నారనే విషయం మాత్రం అర్థమవుతోంది.

కౌన్సిలర్లకే దిక్కులేదు, చైర్మన్ పోస్ట్ కి అభ్యర్ధులా..?

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విషయంలో టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారు. ఉపసంహరణలు కూడా మొదలైతే టీడీపీ బలమెంతో పూర్తిగా అర్థమవుతుంది. పంచాయతీ ఎన్నికలతో డీలా పడ్డ పార్టీ నేతలు, మున్సిపాల్టీలపై ఏమాత్రం నమ్మకం పెట్టుకోలేదు. పంచాయతీ పోరులో చేతులు కాల్చుకున్న అభ్యర్థులను చూసి, పురపోరులో బరిలో ఉన్న ఆ కాస్త మంది కూడా వెనక్కి తగ్గే అవకాశముంది.

అంటే.. కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేయడానికే టీడీపీ అభ్యర్థులను వెదుక్కోవాల్సిన పరిస్థితి. అలాంటి పార్టీ ఏకంగా చైర్మన్ అభ్యర్థుల్ని ప్రకటించడం వింతకాక ఇంకేంటి? విజయవాడ, గుంటూరు, విశాఖ చైర్మన్ అభ్యర్థుల విషయంలో టీడీపీలో అంతర్గత పోరు జరుగుతోందని, అభ్యర్థిగా ఎవరికి వారే బరిలో ఉంటామంటూ ఉత్సాహం చూపిస్తున్నారని అనుకూల మీడియాలో కథనాలొస్తున్నాయి.

కౌన్సిలర్లుగా గెలవలేని ఈ అభ్యర్థులంతా చైర్మన్ గిరీకీ పోటీ పడతారంటే నమ్మే పరిస్థితి లేనే లేదు. పంచాయతీలకంటే మరింత దారుణమైన ఫలితాలు టీడీపీకి పురపోరులో ఎదురు కాబోతున్నాయి. అందుకే ఆ పార్టీ మరింత హడావిడి చేస్తోంది. మేనిఫెస్టో విడుదల చేసి మరీ కామెడీ పండిస్తున్నారు నేతలు. 

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

నారావారి కుటుంబంలో మాన‌సిన స‌మ‌స్య ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?