Advertisement

Advertisement


Home > Politics - Political News

మతిలేని టీడీపీ.. గతిలేని విమర్శలు

మతిలేని టీడీపీ.. గతిలేని విమర్శలు

టీడీపీ నాయకులు గోతికాడ నక్కల కంటే హీనంగా మారిపోయారు. ఎన్నికల కోసం మరో నాలుగేళ్లు ఆగలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టి ఏడాది తిరగలేదు, అప్పుడే అధికారం కోసం వెంపర్లాడుతున్నారు పచ్చ నాయకులు. కోర్టుల్లో వ్యతిరేకంగా తీర్పులొస్తున్నాయి కాబట్టి సీఎం జగన్ రాజీనామా చేయాలంట. ఇంతకంటే చెప్ప విమర్శ ఈమధ్య కాలంలో లేదేమో.

ఇంకా నయం జగన్ నిజంగా రాజీనామా చేస్తే టీడీపీకి ఆ 23 సీట్లు కూడా రావేమో. ఈమధ్య రాజకీయ వలసలతో తనకి ప్రతిపక్ష నేత అనే హోదా పోతుందని తెగ ఇదైపోతున్న బాబు, ఎన్నికలు జరిగితే  అసెంబ్లీ మెట్లెక్కే అర్హత కూడా కోల్పోతారేమో. సీఎం రాజీనామా చేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్ వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం కాక మరేంటి?

ప్రజలు జగన్ కి 151 సీట్ల మెజార్టీ ఇచ్చి ఏడాది కాలేదు. ఈ ఏడాదిలోనే నవరత్నాలు అమలులో పెట్టి తనకి ఓట్లు వేయని వారి మనసుల్లో కూడా సుస్థిర స్థానం పొందారు జగన్. అలాంటి వ్యక్తి రాజీనామా చేయాలట. చేస్తే, వెంటనే ఎన్నికలొస్తే మళ్లీ బాబు అధికారంలోకి వస్తారట. ఇలాంటి దిక్కుమాలిన ఊహలతో కాలం గడిపారు కాబట్టే.. గత ఎన్నికల్లో ఊహించని విధంగా టీడీపీకి పరాభవం ఎదురైంది. 

ఇక బాబు అను"కుల" మీడియా కోరిక కూడా ఇదే కాబోలు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో రోజులు అధికారంలో ఉండదని, 2022లో కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్తుందని, అప్పుడు ఏపీలో కూడా ఎన్నికలొస్తాయని కథనాలు వండి వారుస్తోంది. ఇలాంటి చచ్చు పుచ్చు స్టోరీలను టీడీపీ సోషల్ మీడియా వింగ్ పాపులర్ చేస్తుందేమో కానీ, ఏపీ జనాలు ఏమాత్రం నమ్మరు. నమ్మకపోగా నవ్వుకుంటారు. టీడీపీ నాయకుల్ని, వాళ్ల మీడియాని చూసి జాలిపడతారు.

ఒక్కోసారి అసెంబ్లీ ఎన్నికలను కూడా ఆరేడు దఫాలుగా జరిపే మన దేశంలో.. జమిలి ఎన్నికలంటే సాధ్యమేనా? పోనీ సాధ్యపడితే ఎన్ని విడతల్లో ఎన్నికలు జరగాలి, ఎన్ని బలగాలను రాష్ట్రాలకు పంపించాలి. జమిలి సాధ్యపడదని ఈపాటికే తేలిపోయినా.. ఏడాది పరాభవాన్ని ఏ మొహం పెట్టుకుని సమీక్షించుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో 2022లో ఎన్నికలొస్తాయంటూ టీడీపీ నేతలు అల్పసంతోషం పొందుతున్నారు.

స్థానిక పోరులో అభ్యర్థులకు దిక్కులేని టీడీపీ సిగ్గులేకుండా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తానంటోంది. అందుకే అనేది టీడీపీకి మతిపోయిందని.

అసలు విషయం మర్చిపోయిన చంద్రబాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?