Advertisement

Advertisement


Home > Politics - Political News

టీడీపీ వర్సెస్ పోలీస్.. ముదురుతున్న వ్యవహారం

టీడీపీ వర్సెస్ పోలీస్.. ముదురుతున్న వ్యవహారం

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ప్రతిపక్షాల దాడి రోజు రోజుకీ తీవ్రమవుతోంది. మాటలతో వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు టీడీపీ నేతలు. తమ అక్రమాలను, అవినీతిని బయటపెట్టనీయకుండా ముందుగానే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి దిగుతున్నారు. 

అచ్చెన్నాయుడు మరో అడుగు ముందుకేసి ఖాకీలకు తాట తీస్తామంటూ హెచ్చరించడం తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు, చినబాబు కూడా పోలీసులపై ఇలాగే నోరు పారేసుకున్నారు. దీన్ని ఇప్పుడు కింది స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా కంటిన్యూ చేస్తున్నారు.

అన్నీ తప్పుడు కేసులేనా..?

తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారనేది టీడీపీ నేతల ఆరోపణ. అచ్చెన్న అక్రమాలు, రవీంద్ర దౌర్జన్యాలు వారికి కనపడకపోవడం దారుణం. అంతెందుకు.. కేవలం బాధితుల్ని రెచ్చగొట్టేందుకే లోకేష్, శవరాజకీయాలు చేస్తున్నారనే విషయం ఎవరికి తెలియదు. 

మరి ఇలాంటి పనులు చేస్తే అరెస్ట్ చేయకుండా ఊరుకుంటారా..? అరెస్ట్ లు చేస్తే ఎగిరెగిరి పడుతున్న టీడీపీ నేతలు, నేరుగా పోలీస్ వ్యవస్థనే తప్పుబడుతున్నారు. వైసీపీలో చేరాలని, ఆ పార్టీ నేతల ఇళ్లలో డ్యూటీలు చేయాలని పరోక్షంగా దెప్పిపొడుస్తున్నారు.

చంద్రబాబు మొదలు పెట్టిన ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్ ని మిగతా నేతలు కంటిన్యూ చేస్తున్నారు. ఓ దశలో నారా లోకేష్ కూడా పోలీసుల్ని దుర్భాషలాడిన సందర్భాలున్నాయి. అన్నీ గుర్తుపెట్టుకుంటాం, వడ్డీతో సహా చెల్లిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. పోలీసుల్ని వారి డ్యూటీ చేయకుండా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

తాజాగా అచ్చెన్నాయుడు తాటతీస్తామంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. పోలీసుల తీరు శృతి మించుతోందని, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ లు అన్నీ నిండిపోయాయని అన్నారు అచ్చెన్న. 

తప్పుడు కేసులకు మూల్యం చెల్లించక తప్పదని, తప్పు చేసిన పోలీసుల తాట తీస్తామని హెచ్చరించారు. కడప జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్త అరెస్ట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తర్వాత అచ్చెన్న క్షమాపణలు చెప్పారు, అది వేరే విషయం.

తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోడానికి నెపాన్ని పోలీసులపైకి నెట్టేస్తున్నారు టీడీపీ నేతలు. ఎక్కడ ఎవరు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినా, పోలీసుల వేధింపులు, అధికార పార్టీ కక్షసాధింపులని తేల్చేస్తున్నారు. మా సత్తా చూపిస్తాం, రివేంజ్ తీర్చుకుంటామంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చివరకు వారికే చేటు తెచ్చేలా ఉన్నాయి. 

లేనిపోని నెపాన్ని ఆపాదిస్తున్నందుకు నిజంగానే పోలీసులు వారిపై రివేంజ్ తీర్చుకునే రోజులొస్తే అప్పుడు టీడీపీ నేతలు ఏమంటారో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?