cloudfront

Advertisement


Home > Politics - Political News

బీసీ అభ్యర్థిపై టీడీపీ కుట్ర మామూలుగా లేదు!

బీసీ అభ్యర్థిపై టీడీపీ కుట్ర మామూలుగా లేదు!

అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేయాలని అనుకుంటున్న గోరంట్ల మాధవ్ విషయంలో అధికార పార్టీ అమలు పరుస్తున్న కుట్ర వివాదాస్పదంగా మారింది. తొలిసారి హిందూపురం ఎంపీ సీటు నుంచి ఒక కురుబ అభ్యర్థి పోటీచేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో.. అతడిని పోటీచేయింకుండా ఉండేందుకు భారీస్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది.

సీఐగా ఉద్యోగం చేస్తూ ఉండిన గోరంట్ల మాధవ్ గత ఏడాది డిసెంబర్ ముప్పైన వీఆర్ఎస్ కు అప్లై చేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎంతకూ క్లియరెన్స్ ఇవ్వకపోవడం విశేషం. తన వీఆర్ఎస్ విషయంలో పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారని, లేని ఆటంకాలను సృష్టించి తన రాజకీయ ప్రయాణానికి అడ్డుపడుతూ ఉన్నారని గోరంట్ల మాధవ్ వాపోతూ ఉన్నారు.

ఈ విషయంలో ఆయన కోర్టుకు కూడా వెళ్లారు. తాజాగా అందుకు సంబంధించి కోర్టు తీర్పు కూడా వచ్చింది. మాధవ్ వీఆర్ఎస్ కు అనుమతిని ఇచ్చేయాలని, రిలీవ్ చేయాలని కోర్టు తీర్పును ఇచ్చిందని మాధవ్ తెలిపారు. ఆ తీర్పు ప్రతితో తను ఉన్నతాధికారులను కలిసే ప్రయత్నంలో ఉన్నారని ఆయన చెప్పారు.

అయితే సదరు ఉన్నతాధికారిని లీవ్ మీద పంపించి, తన రిలీవింగ్ లెటర్ ను పెండింగ్ లో పెట్టే కుట్ర జరుగుతూ ఉందని ఆయన చెప్పడం గమనార్హం. అయినా... అదెవరు అయినా, ఎన్నికల్లో పోటీచేసే హక్కును కలిగి ఉంటారు. అదేవిధంగా మాధవ్ కు కూడా ఆ హక్కు ఉంటుంది. అందుకు సంబంధించి డిపార్ట్ మెంట్ నుంచి రిలీవ్ కావడానికి ఆయన మూడునెలల కిందటే ప్రయత్నాలు ప్రారంభించారు. అంతా క్లియర్ అయినా.. తన మీద పాతకేసులు ఉన్నాయని తప్పుడు నివేదికలు ఇచ్చారని అంటున్నారాయన.

అయినా.. ఒకవ్యక్తి పోటీ విషయంలోనే ఇలాంటి ఆటంకాలు కలిగించాల్సిన అవసరం ఏముంది? అతడు గెలుస్తారా ఓడతారా.. అనేవి తర్వాతి సంగతులు. అయితే ఒక బీసీ కులానికి చెందిన పోలీసు అధికారి తన ఇష్ట ప్రకారం రాజకీయంగా వెళ్లాలని అనుకుంటే.. అధికారంలోని పార్టీ మరీ ఇన్ని ఆటంకాలు కలిగించడం మాత్రం చాలా దారుణమైన విషయం. అధికారం ఉంది కదా.. అని ఎక్కడకు పడితే అక్కడకు వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదు. అది కూడా ఎన్నికల వేళ ఇలాంటి చేష్టలు తక్షణ ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి. 

పరిటాల కుటుంబం గెలిస్తే.. వీళ్లంతా పారిపోవాల్సిందే

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?